Begin typing your search above and press return to search.

కొడుకు కూతురుతో మాస్ రాజా సంద‌డి

By:  Tupaki Desk   |   1 Jun 2020 8:10 AM GMT
కొడుకు కూతురుతో మాస్ రాజా సంద‌డి
X
స్వీయ నిర్భంధంలో స్టార్లు ఎవ‌రికి తోచిన‌ట్టు వారు టైమ్ స్పెండ్ చేశారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో ప‌ద్ధ‌తి. అయితే ఎవ‌రు ఏం చేసినా కానీ కుటుంబంతో దాదాపు రెండు నెల‌లు పైగా గ‌డిపే అవ‌కాశం దొర‌క‌డం రేర్ అనే చెప్పాలి. షూటింగుల‌కు ఇబ్బంది క‌లిగించినా ఒక‌ర‌కంగా మ‌హమ్మారీ ఇచ్చిన స‌ద‌వ‌కాశ‌మిది. స్టార్లంతా ఎక్కువ స‌మ‌యం కుటుంబ స‌భ్యుల‌తో స్పెండ్ చేసేందుకు కేటాయించి ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. నిరంత‌ర బిజీ షెడ్యూళ్ల న‌డుమ ఇదో పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.

మాస్ మహారాజా రవితేజ కూడా య‌థావిధిగా త‌న కుటుంబంతో టైమ్ స్పెండ్ చేశారు. ముఖ్యంగా త‌న కొడుకు మ‌హాధ‌న్ స‌హా కుమార్తె మోక్ష‌ద భూప‌తిరాజాకు ఎక్కువ‌ స‌మ‌యాన్ని వెచ్చించారు. వారితో క‌లిసి జాలీగా గ‌డిపిన క్ష‌ణాల్ని ఫోటోల రూపంలో ప‌దిల‌ప‌రిచి సామాజిక మాధ్య‌మాల ద్వారా రివీల్ చేశారు. స్వ‌త‌హాగా కుటుంబ స‌భ్యుల‌ను బ‌య‌టికి ఎక్స్ పోజ్ చేసేందుకు రాజా ఇష్ట‌ప‌డ‌ర‌ని చెబుతుంటారు. ఎప్పుడో రేర్ గా మాత్రమే ఆడియో ఈవెంట్ల‌కు విచ్చేసారు ర‌వితేజ కుటుంబీకులు.

ఇక ఆయ‌న వార‌సుడు మ‌హాధ‌న్ ఇంత‌కుముందు రాజా-ది గ్రేట్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసాడు. అతను ఈ చిత్రంలో చిన్న రవితేజ పాత్రను పోషించాడు. త్వ‌ర‌లో హీరో అవుతాడ‌ని స‌మాచారం. కుమార్తె మోక్ష‌ద ప్ర‌స్తుతం స్టడీస్ తోనే బిజీ. ఇక‌పోతే ఇలా వార‌సులు డాడీతో క‌లిసి ఉన్న ఫోటోలు మాత్రం ఇంత‌కుముందు రివీల్ కాక‌పోవ‌డంతో అవి కాస్తా సోష‌ల్ మీడియాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇక‌పోతే ర‌వితేజ కెరీర్ సంగ‌తి చూస్తే కాస్త క్లిష్ఠ స‌న్నివేశాన్నేఎదుర్కొంటున్నాడు. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ సెట్స్ పై ఉంది. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి రిలీజ్ బ‌రిలో నిలిపేందుకు సిద్ధం చేస్తున్నారు.