Begin typing your search above and press return to search.
మాస్ రాజా.. ఈ సినిమా కూడా లేదా?
By: Tupaki Desk | 4 May 2019 10:52 AM GMTఓ రెండేళ్ళ క్రితం వరకూ మాస్ మహారాజా జోరు మామూలుగా ఉండేది కాదు. ఏడాదికి రెండు మూడు రిలీజులు.. ఎలాంటి సినిమా అయినా మినిమమ్ గ్యారెంటీ అన్నట్టుగా ఉండేది. కానీ తర్వాత ఎందుకో పరిస్థితి మారిపోయింది. 'నేల టికెట్'.. 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాల కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరచడంతో కొత్త ప్రాజెక్టుల విషయంలో పునరాలోచనలో పడ్డాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'తెరి' రీమేక్ క్యాన్సిల్ అయిన సంగతి తెల్సిందే. ఇక మరో సినిమా 'డిస్కో రాజా' కూడా ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'డిస్కోరాజా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిందని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ పై ఎటువంటి అప్డేట్ లేదు. ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందట. రవితేజకు ఇప్పుడు మార్కెట్ తగ్గడంతో దానికి తగ్గట్టు బడ్జెట్ ను తగ్గించాలని నిర్మాతలు అంటున్నారని.. అయితే ఆ విషయంపై మిగతావారికి ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని అంటున్నారు.
బడ్జెట్ మాత్రమే కాకుండా సమంతా తాజా చిత్రం 'ఓ బేబీ' కథకు 'డిస్కో రాజా' కథకు పోలికలు ఉండడం కూడా ఈ సినిమా ఆగిపోవడానికి మరోకారణం అనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇలా మాస్ రాజా సినిమాల క్యాన్సిల్ కావడం అభిమానులకు నిరాశ కలిగించే పరిణామమే.