Begin typing your search above and press return to search.

తక్కువ రేటుకే మాస్‌ రాజా!!!

By:  Tupaki Desk   |   9 Sept 2015 9:50 AM IST
తక్కువ రేటుకే మాస్‌ రాజా!!!
X
ఓవర్‌ నైట్‌ లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి! నిన్నటివరకూ కోటి పారితోషికం అందుకున్న వాళ్లకు కూడా నటించడానికి సినిమా ఉండదు. ఒక్క ఫ్లాపుతో సినిమా ఛాన్సిచ్చేవాళ్లుండరు. పారితోషికం పూర్తిగా అందుతుందో లేదో తెలీదు. పరిస్థితి పూర్తిగా టైటానిక్‌ సింకింగ్‌ లా మారిపోతుంది. ప్రస్తుతం రవితేజ పరిస్థితి అలానే ఉంది. అతడు నటించిన కిక్‌2 ఇచ్చిన ఝలక్‌ మామూలుగా లేదని తెలుస్తోంది.

ఇప్పటికైతే మాస్‌ రాజా ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్నాడు. సంపత్‌ నంది దర్శకత్వంలో బెంగాళ్‌ టైగర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఆన్‌ సెట్స్‌ ఉన్నది అదొక్కటే. అయితే ఈ సినిమా తర్వాత అతడికి మరో సినిమా ఉండాలంటే కచ్చితంగా హిట్‌ కొట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ప్రతికూలంగా మారిపోయిందో ఇప్పుడు కూడా అలానే ఉందని అంటున్నారు.

బలుపు, పవర్‌ విజయాలు రవికి ఏమాత్రం కనిపించడం లేదిప్పుడు.. కంఫర్ట్‌ కోసం సీన్ లు తీసేప్పుడు అవి పండుతున్నాయా? లేదా? అన్నదానిపై కిక్‌ 2 టీమ్‌ కు క్లారిటీ లేకపోవడం వలనే ఈ పరిస్థతి వచ్చింది. కారణాల్ని విశ్లేషించుకుని బైటపడే సత్తా ఉన్న హీరో రవితేజ. ఇకనైనా పరిస్థితుల్ని దారిలోకి తెచ్చుకుంటాడేమో చూడాలి. ఇకపోతే దిల్‌ రాజు గారి కామెడీ సినిమా, అదేనండీ వేణు శ్రీరామ్‌ డైరక్షన్‌ లో మూవీని చాలా తక్కువ రేటుకే ఒప్పుకున్నాడట మాస్‌ రాజా.