Begin typing your search above and press return to search.

చిరు-పూరి క్లాష్ ఎవరికి లాభమంటే..

By:  Tupaki Desk   |   2 Feb 2016 11:00 PM IST
చిరు-పూరి క్లాష్ ఎవరికి లాభమంటే..
X
మాస్ మూవీస్ తీయడంలో పూరీ జగన్నాథ్ టాప్ అనే విషయం చెప్పాల్సిన పని లేదు. నేను పది సీన్లు తీయాల్సొస్తే.. పూరీ ఒక డైలాగ్ తో చెప్పేస్తాడు అని రాజమౌళి లాంటి డైరెక్టర్ నుంచి ప్రశంసలు పొందిన పూరీ.. ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. రీసెంట్ టైమ్ లో ఈ డైరెక్టర్ చేసిన మిస్టేక్ గా జ్యోతిలక్ష్మి మూవీని చెప్పచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టెంపర్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత.. ఇంతటి దారుణమైన మూవీని జనాలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.

ఈ దెబ్బతో పూరీ చేతికి వచ్చిన చిరు 150వ సినిమా కూడా చేజారిపోయింది. సెకండాఫ్ సరిగా రాలేదని కారణం బైట పెట్టినా.. అసలు రీజన్ మాత్రం జ్యోతిలక్ష్మి కొట్టిన దెబ్బే. గతంలో కూడా పూరీకి ఇలాగే చిరు సినిమా చేతికొచ్చి జారిపోయింది. ఆంధ్రావాలాను మొదట చిరుతోనే తీయాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ తో చేశాడు పూరీ. కానీ ఇది డిజాస్టర్ కావడంతో.. అప్పుడూ చిరుతో మూవీ క్యాన్సిల్ అయింది. కానీ ఆ తర్వాత పూరీ మంచి మంచి సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకుని, మరిన్ని మెట్లు ఎక్కాడు. ఇప్పుడు కూడా ఫ్లాప్ కారణంగా చిరు మూవీ ఆటో జానీ క్యాన్సిల్ అయింది.

ఇదే సినిమాని రవితేజతో తీసేందుకు సిద్ధమవుతున్నాడు పూరీ జగన్నాధ్. మరి ఇప్పుడు కూడా తనను నిరూపించేందుకు బాగా కష్టపడి బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం.. మెగా టీం ఆలోచనలో పడాల్సి వస్తుంది. కానీ ఇది హిట్ అయితే మాత్రం.. రవితేజ బాగా గెయిన్ అవుతాడు. ఏమైనా చిరు-పూరీల మధ్య క్లాష్ వచ్చినప్పుడల్లా అది మాస్ మహరాజ్ కు బాగా ప్లస్ అవుతుండడం విశేషం.