Begin typing your search above and press return to search.

మాస్ మహరాజ్.. బ్యాడ్ పోలీస్

By:  Tupaki Desk   |   28 July 2016 6:01 AM GMT
మాస్ మహరాజ్.. బ్యాడ్ పోలీస్
X
మాస్ మహరాజ్ రవితేజ సినిమా సెట్స్ కి వెళ్లి చాలా నెలలు గడిచిపోయింది. బెంగాల్ టైగర్ తర్వాత ఒక సినిమాని కూడా స్టార్ట్ చేయలేదు. దాదాపు మూడు ప్రాజెక్టులు అనుకున్నా.. ఒక్కటీ పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడో సినిమాని ఫైనల్ చేశాడని.. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రంకి స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ సిరి.. దర్శకుడిగా మారుతూ రవితేజతో సినిమా తీయబోతున్నాడు. ఇందులో మాస్ మహరాజ్ ఓ బ్యాడ్ పోలీస్ గా నటించబోతున్నాడట. వక్కంతం వంశీ స్టోరీ అందించగా.. విక్రమ్ సిరి డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొదంనుంది. తనను తాను ఓవర్ గా ఊహించేసుకునే ఈ పోలీస్ ఆఫీసర్ పాత్రను రవితేజ విపరీతంగా ఇష్టపడ్డాడని తెలుస్తోంది. గతంలో పవర్ - విక్రమార్కుడు మూవీస్ లో రవితేజ పోలీస్ పాత్రలు చేసినా.. కొత్త సినిమాలో కేరక్టరైజేషన్ విభిన్నంగా ఉంటుందని.. ఈ హీరో ఇప్పటివరకూ చేయని తరహాలో ఈ రోల్ ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఆగస్టులోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో మూవీపై అధికారికంగా ప్రకటించనున్నాడు రవితేజ.