Begin typing your search above and press return to search.

గ‌ళ్ల చొక్కాలో హుషారుగా విచార‌ణ‌కు ర‌వితేజ‌

By:  Tupaki Desk   |   28 July 2017 5:02 AM GMT
గ‌ళ్ల చొక్కాలో హుషారుగా విచార‌ణ‌కు ర‌వితేజ‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన డ్ర‌గ్స్ విచార‌ణ కోసం ప్ర‌ముఖ హీరో ర‌వితేజ అబార్కీ కార్యాల‌యానికి వ‌చ్చారు. గ‌డిచిన కొద్ది రోజులుగా సినీ ప్ర‌ముఖులు ప‌లువురిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎనిమిది మంది సినీ ప్ర‌ముఖుల్ని విచారించిన అధికారులు.. ఈ రోజు హీరో ర‌వితేజ‌ను విచారిస్తున్నారు. ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ఆయ‌న అబార్కీ కార్యాల‌యానికి రావాల్సి ఉంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు (ఇద్ద‌రు మ‌హిళా న‌టీమ‌ణుల‌ను మిన‌హాయిస్తే) అంతా అధికారులు పేర్కొన్న స‌మ‌యం కంటే ముందుగానే అబార్కీ కార్యాల‌యానికి విచ్చేశారు. కొంద‌రైతే అధికారుల కోసం వెయిట్ చేశారు కూడా. అయితే.. హీరో ర‌వితేజ మాత్రం స‌రిగ్గా విచార‌ణ స‌మ‌యానికి కొద్ది నిమిషాల ముందే అబార్కీ కార్యాల‌యానికి చేరుకున్నారు.

మ‌రో ఇద్ద‌రితో క‌లిసి వ‌చ్చిన ర‌వితేజ‌.. విచార‌ణ‌కు హాజ‌రైన మిగిలిన సినీ ప్ర‌ముఖుల (మ‌హిళా న‌టీమ‌ణుల‌ను మిన‌హాయిస్తే) మాదిరి వైట్ ష‌ర్ట్ లో కాకుండా గ‌ళ్ల రంగు చొక్కాతో హాజ‌ర‌య్యారు. కారు దిగిన‌ప్ప‌టి నుంచి సిట్ కార్యాల‌యానికి వెళ్లేంత వ‌ర‌కూ చూస్తే.. ర‌వితేజలో ఎలాంటి టెన్ష‌న్ క‌నిపించ‌లేద‌ని చెప్పాలి. హుషారుగా కారు దిగిన ర‌వితేజ‌.. వేగంగా న‌డుచుకుంటూ కార్యాల‌యంలోకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముఖం మీద న‌వ్వు చెద‌ర్లేదు. వేగంగా న‌డుస్తూ.. ఎటువైపు వెళ్లాల‌న్న విష‌యాన్ని అక్క‌డి వారిని అడిగిన ర‌వితేజ‌.. అక్క‌డి సిబ్బంది పేర్కొన్న‌ట్లుగా లిఫ్ట్ వైపు వెళ్లారు. ప్ర‌స్తుతం ర‌వితేజ‌ను అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.