Begin typing your search above and press return to search.

రవితేజ 66 అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   26 Oct 2019 9:14 AM GMT
రవితేజ 66 అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌
X
మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్‌ దర్శకత్వంలో 'డిస్కోరాజా' చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో డిస్కోరాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే నెలలో ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాబోతుందట. ఈమద్య కాలంలో కాస్త స్లో అయిన రవితేజ డిస్కోరాజా విడుదలకు ముందే మరో సినిమాను ప్రకటించి తన స్పీడ్‌ మళ్లీ పెరిగిందంటూ చెప్పకనే చెప్పాడు.

రవితేజ 65వ చిత్రంగా డిస్కో రాజా తెరకెక్కుతుండగా.. 66వ చిత్రం అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ నేడు దీపావళి సందర్బంగా వచ్చింది. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో డాన్‌ శీను మరియు బలుపు చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్‌ మూవీకి రంగం సిద్దం అయ్యింది. వీరిద్దరి కాంబో మూవీ అధికారిక ప్రకటన నేడు వచ్చింది.

పోలీస్‌ స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ తో ఈ చిత్రం రూపొందబోతుందని హింట్‌ ఇస్తూ ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభోత్సవంకు ముందు ప్రకటించే అవకాశం ఉంది. రవితేజ 66 మూవీ అప్‌ డేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెడ్‌ అవుతుంది. రవితేజ ఫ్యాన్స్‌ ఈ ప్రకటనతో చాలా హ్యాపీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్‌ ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.