Begin typing your search above and press return to search.

దారెక్కడుంది రాజా?

By:  Tupaki Desk   |   24 Oct 2018 7:51 AM GMT
దారెక్కడుంది రాజా?
X
సినిమా విడుదల విషయంలో ప్లానింగ్ ఏ మాత్రం తేడా కొట్టినా దాని తాలూకు ప్రభావం ఒకోసారి తీవ్ర గందరగోళంలోకి ఆలస్యంలోకి నెట్టేస్తుంది. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. నిజానికి ఇది ముందు అనుకున్న ప్రకారం అయితే అక్టోబర్ 5నే రావాలి. కానీ అప్పటికే నోటా అదే డేట్ కు కర్చీఫ్ వేసేయడం వారం గ్యాప్ లోనే అరవింద సమేత వీర రాఘవ ఎటాక్ కి రెడీగా ఉండటంతో ఎందుకొచ్చిన రిస్క్ లెమ్మని సైలెంట్ అయ్యారు.

అప్పటికీ అమర్ అక్బర్ ఆంటోనీ ప్రమోషన్ కూడా పెద్దగా జరగలేదు కాబట్టి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు చిక్కంతా డేట్ లాక్ చేయడం దగ్గరే వచ్చింది. నవంబర్ లో క్రేజీ సినిమాలన్నీ క్యూ కట్టడమే దీనికి కారణం. మొదటివారంలో ఇదే నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తీసిన సవ్యసాచి విడుదల చేసే ఆలోచన జరుగుతోంది కాబట్టి ఆ ఛాన్స్ లేదు. ఒకవేళ ఫస్ట్ వీక్ కుదరకపోతే రెండో వారం పక్కా కావొచ్చు. కానీ దాంతో పాటు విజయ్ సర్కార్-తగ్స్ అఫ్ హిందుస్థాన్ భారీ క్రేజ్ మధ్య వస్తున్నాయి. అందుకే నవంబర్ 16న ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మళ్ళి ఈసారి కూడా విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతో కర్చీఫ్ వేసాడు. సో అదీ మిస్ అయినట్టే.

ఇదేదీ వద్దు నాలుగో వారం చూద్దామా అంటే 29న సూపర్ స్టార్ 2.0 రెడీగా ఉంది. సో నవంబర్ లో రవితేజకు రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. డిసెంబర్ దీనికి తక్కువేమి లేదు కానీ కాస్త గట్టి నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుంటే తప్ప అమర్ అక్బర్ ఆంటోనీకి మోక్షం కలగదు. శీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఇలియానా హీరోయిన్