Begin typing your search above and press return to search.

బాలీవుడ్ న‌టితో ఎఫైర్‌.. సోష‌ల్ మీడియాలో ర‌విశాస్త్రిపై ర‌చ్చ‌!

By:  Tupaki Desk   |   5 Jun 2021 2:30 PM GMT
బాలీవుడ్ న‌టితో ఎఫైర్‌.. సోష‌ల్ మీడియాలో ర‌విశాస్త్రిపై ర‌చ్చ‌!
X
క్రికెట్ - సినిమాకు మ‌ధ్య ఉన్న లంకె ఎంత బ‌ల‌మైన‌దో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ - టీమిండియా మ‌ధ్య ఉన్న ల‌వ్ ట్రాక్ కు మంచి రికార్డే ఉంది. ప‌లువురు క్రికెట‌ర్లు బాలీవుడ్ తార‌ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపారు. పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లిన‌వి త‌క్కువే కావొచ్చుగానీ.. చెట్టా ప‌ట్టాలేసుకొని తిరిగిన జంట‌లు మాత్రం చాలానే ఉన్నాయి. అయితే.. లేటెస్ట్‌ ర‌విశాస్త్రిపై నెట్టింట్లో ట్రోలింగ్ న‌డుస్తోంది.

కానీ.. ఈ టాపిక్ మాత్రం ఎప్పుడో నాలుగేళ్ల కింద‌టిది కావ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ర‌విశాస్త్రి అప్పుడు క్లారిటీ కూడా ఇచ్చేశాడు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ ఆ వ్య‌వ‌హారం ఏమంటే...

2016లో ఆడీ కారు ఓపెనింగ్ ఫంక్ష‌న్ కు బాలీవుడ్ బ్యూటీ నిమ్ర‌త్ కౌర్ తో క‌లిసి వెళ్లాడు ర‌విశాస్త్రి. అక్క‌డ ఇద్ద‌రూ సంద‌డి చేశారు. అంత‌టితో పుల్ స్టాప్ పెట్టి ఉంటే ఏ గొడ‌వా ఉండేది కాదు. ఆ త‌ర్వాత కూడా వీరిద్ద‌రూ క‌లిసి కొన్ని పార్టీల‌కు వెళ్లారు. ఇంకొన్ని కార్య‌క్ర‌మాల‌కు కూడా క‌లిసి హాజ‌ర‌య్యారు. రిలేష‌న్ క్రియేట్ చేయ‌డానికి ఈ మాత్రం స‌రిపోతుంది క‌దా? అదే ప‌నిచేశారు నెటిజ‌న్లు.

లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ అంటూ ట్రోలింగ్ మొద‌లు పెట్టారు. వీరిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయార‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని హై రేంజ్ లో ప్ర‌చారం జ‌రిగింది. ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌డంతో.. 2018లో మీడియాకు క్లారిటీ ఇచ్చాడు ర‌విశాస్త్రి.

ఇదంతా బుల్ షిట్ వ్య‌వ‌హార‌మ‌ని చెప్పాడు. ప‌నిలేని వాళ్లు చేసే వ్యాఖ్యానాల‌ని, వీటిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పాడు. త‌న వ‌ద్ద కూడా ఎప్పుడూ ప్ర‌స్తావించొద్ద‌ని కోరాడు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఇదే టాపిక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం గ‌మ‌నార్హం.