Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: చేదు ల‌డ్డు... తీపి ల‌డ్డూ

By:  Tupaki Desk   |   30 Sep 2019 5:35 AM GMT
బిగ్‌ బాస్‌: చేదు ల‌డ్డు... తీపి ల‌డ్డూ
X
బిగ్‌ బాస్‌ లో అంతా అనుకున్నట్లుగానే ఈ వారం రవి ఎలిమినేషన్ అయ్యాడు. ఎలిమినేషన్ జోన్ లో ఈ వారం వరుణ్ - బాబా భాస్కర్ - శ్రీముఖి - రవి ఉన్న విషయం తెలిసిందే. అయితే శనివారం వరుణ్ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున - ఆదివారం ఎపిసోడ్ లో మొదట శ్రీముఖిని సేవ్ చేశారు. చివరికి బాబా భాస్కర్ - రవి ఎలిమినేషన్ జోన్‌ లో ఉండగా - రవి బిగ్ బాస్ షో నుంచి తన ఇంటికెళ్ళేందుకు విజయవాడ బస్ టికెట్ బుక్ చేసి అది చూపించి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో బాబా సేఫ్ అయినట్లు ప్రకటించారు.

ఇక రవి ఎలిమినేట్ కావడంతో అలీ - శివజ్యోతి - బాబా భాస్కర్ బాగా ఎమోషనల్ అయ్యారు. అలాగే ఇంటి నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన రవి చేత నాగ్ ఓ టాస్క్ ఆడించారు. చేదు-తీపి పేరిట ఇచ్చిన ఆ టాస్క్ లో ఇంటిలో ఉన్న 9 మంది సభ్యులకు 1 నుంచి 9 నెంబర్లలో ఒక నెంబర్ కేటాయించాలి. అందులో 1 నుంచి 5 నెంబర్లు వచ్చే వారు తీపి లడ్డులు తినాలి. 6 నుంచి 9 వచ్చే వారు చేదు లడ్డులు తినాలి.

మొదట రవి 9 నుంచి మొదలు పెట్టాడు. 9 నెంబర్లో పునర్నవి ఫోటో పెట్టి - ఎందుకు పెట్టాడో కారణాలు చెప్పాడు. దీంతో పున్నూ 9 చేదు లడ్డులు తింది. పున్ను తాను ఇది ఊహించాన‌ని కూడా చెప్పింది. నెక్స్ట్ వితికా 8 - మహేశ్ 7 - రాహుల్ 6 పెట్టాడు. వీరు నలుగురు చేదు లడ్డులు తిన్నారు. తర్వాత బాబా భాస్కర్ 5 - శ్రీముఖి 4 - వరుణ్ 3 - అలీ 2 - శివజ్యోతి 1 పెట్టాడు. ఈ ఐదుగురు తీపి లడ్డులు తిన్నారు. ఇక చివరికి రవి వెళ్ళేపోయే ముందు బిగ్ బాంబ్ పునర్నవి మీద వేశాడు. దీని ప్రకారం బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇంటి లోని మిగతా సభ్యులంద‌రి బట్టలు ఉతకాలి.