Begin typing your search above and press return to search.

రేసుగుర్రం విల‌న్‌ తో పెట్టుకున్నాడు..

By:  Tupaki Desk   |   16 Oct 2015 4:52 AM GMT
రేసుగుర్రం విల‌న్‌ తో పెట్టుకున్నాడు..
X
టాలీవుడ్‌ లో అప్‌ క‌మింగ్ హీరోగా త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు సందీప్ కిష‌న్‌. మామ ఛోటా.కె తో క‌లిసి తెలివైన స్ర్కిప్టుల్ని ఎంచుకుంటూ తెలివైన ప్ర‌ణాళిక‌లు వేస్తూ ముందుకు వెళుతున్నాడు. సందీప్ కిష‌న్ ఇప్ప‌టికే వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ - టైగ‌ర్ లాంటి విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. లేటెస్టుగా ఒక్క అమ్మాయి త‌ప్ప అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. రాజ‌సింహా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సందీప్ రేసుగుర్రం విల‌న్ ర‌వికిష‌న్‌ నే ఢీకొడుతున్నాడు.

రేసుగుర్రం సినిమాలో బ‌న్ని క్యారెక్ట‌ర్‌ - కిక్ శ్యాం క్యారెక్ట‌ర్‌ ల‌తో పోటీ ప‌డుతూ .. ర‌వికిష‌న్ క్యారెక్ట‌ర్ ఉంటుంది. అస‌లు ర‌వికిష‌న్ విల‌నీలో ఎంతో ఎన‌ర్జీ ఉంటుంది. బ‌న్నిని ఢీకొట్టే సిస‌లైన విల‌న్‌ గా క‌నిపించాడు ఆ చిత్రంలో. ఓ వైపు రేసుగుర్రంలా దూసుకొచ్చే బ‌న్నితో ట‌గ్ ఆఫ్ వార్ న‌డిపించే బ్యాడ్ విల‌న్‌ గా అద‌ర‌గొట్టేశాడు. ఓ ప్ర‌త్యేక‌మైన ఆహార్యంతో రేసుగుర్రం సినిమాలో కిక్కు పెంచాడు. అలాంటి విల‌న్ ని ఇప్పుడు కుర్ర హీరో ఢీకొట్ట‌డం అంటే అంత వీజీ కాదు. అందుకు త‌గ్గ‌ట్టే ఆ స‌న్నివేశంలో ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ ని చూపించాల్సి ఉంటుంది.

ర‌వికిష‌న్ రేంజు పెద్ద రేంజు.. బ‌న్ని - ర‌వితేజ లాంటి స్టార్ల‌కు ధీటైన విల‌న్‌ గా క‌నిపించాడు .. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ త‌న స్థాయిని మంచి అత‌డితో క‌లిసి న‌టించాల్సి ఉంటుంది. ఢీ అంటే ఢీ అన్న‌ట్టే సీన్స్‌ లో తెగ‌బ‌డాలి. అప్పుడే జ‌నాల కంటికి ఆనుతుంద‌న్న‌మాట‌!