Begin typing your search above and press return to search.

వీళ్లు విలన్లని కూడా పంచుకుంటున్నారు

By:  Tupaki Desk   |   11 Nov 2015 4:23 AM GMT
వీళ్లు విలన్లని కూడా పంచుకుంటున్నారు
X
మెగా ఫ్యామిలీ అంటే హీరోయిన్స్ కి ఓ లెక్క ఉంది. మొత్తం టీంలో ఒక హీరోతో ఛాన్స్ సంపాదిస్తే.. మరో 2-3 ఆఫర్స్ తగిలేస్తాయ్. వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా.. మెగా హీరోయిన్ - స్టార్ హీరోయిన్ అనిపించేసుకోవచ్చు. అందుకే ఆ క్యాంప్ లోకి ఎంటర్ అయేందుకు భామలు బాగా ఇష్టపడతారు. ఇది ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీపై ఇండస్ట్రీ ఒపీనియన్.

ఇలాంటిదే ఇప్పుడింకో ట్రెండ్ మొదలవుతోంది. అది కూడ మెగా ఫ్యామిలీలోనే. అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రం సినిమా చూసిన ఎవరికైనా.. మద్దాలి శివారెడ్డి అనగానే ఓ పిక్చర్ మైండ్ లో తడుతుంది. అంతగా విలన్ కేరక్టర్ ని పండించాడు రవికిషన్. ఇప్పడు విలన్ మరో మెగా హీరో మూవీలో చేయనున్నాడనే వార్త టాలీవుడ్ లో షికారు చేస్తోంది. మెగా సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్ - దిల్ రాజు నిర్మాణంలో సుప్రీం అనే మూవీ తెరకెక్కుతోంది. రాశిఖన్నా పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం కోసం.. రవికిషన్ నే విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంంది.

ఇలా వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో చేసిన విలన్స్ అరుదుగా ఉంటారు. ఇంత వేగంగా ఆ క్యాంప్ నుంచి పిలుపు రావడం చూస్తుంటే.. రవికిషన్ గ్రాఫ్ త్వరగానే పెరిగపోనుందని టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్లను ఎక్స్ ఛేంజ్ చేసుకున్నట్లుగా.. విలన్లను కూడా మార్చుకునే కొత్త కల్చర్ ని మెగా క్యాంప్ స్టార్ట్ చేసిందని అనుకోవచ్చు ఇక.