Begin typing your search above and press return to search.

కిక్-2 క్లిక్కయితే అతడి దశ తిరిగినట్లే

By:  Tupaki Desk   |   13 Aug 2015 9:25 AM GMT
కిక్-2 క్లిక్కయితే అతడి దశ తిరిగినట్లే
X
టాలీవుడ్ లోకి హీరోయిన్లే కాదు.. విలన్లు కూడా వలస వస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త విలన్లను తెలుగు తెరకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన దర్శకులు. ఓ విలన్ ను నాలుగైదేళ్లకు మించి చూడ్డానికి మన ప్రేక్షకులు ఇష్టపడరు. ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్ లాంటి వాళ్లు ఔట్ డేటెడ్ అయిపోవడంతో గత రెండు మూడేళ్లలో కొత్త కొత్త విలన్లు టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. వాళ్లలో రవికిషన్ ఒకడు. భోజ్ పురి సినిమాల్లో హీరోగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న రవికిషన్ ను.. గత ఏడాది ‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు తెరకు విలన్ గా పరిచయం చేశాడు సురేందర్ రెడ్డి. మద్దాల శివారెడ్డిగా రవికిషన్ అభినయం ‘రేసుగుర్రం’కు హైలైట్ గా నిలిచింది. అతడి విలనీని కొత్తగా ఫీలయ్యారు తెలుగు ప్రేక్షకులు.

ఐతే తొలి సినిమాతో అంత మంచి పేరు సంపాదించినా.. రవికిషన్ కు వేరే సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఐతే సురేందర్ రెడ్డే మళ్లీ తన కిక్-2 సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులోనూ రవికిషన్ విలనే. కిక్ సినిమాతో పోలిస్తే కిక్-2లో యాక్షన్ పార్ట్, విలనీకి ఎక్కువ ప్రాధాన్యం ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఇందులో రవికిషన్ క్యారెక్టర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో రవికిషన్ లుక్ ను కూడా బయటపెట్టారు. మరో మాట లేదు.. అతడి లుక్ అదిరిపోయింది. నీలి కళ్లు, తెల్ల జుట్టుతో ఆ లుక్ లో ఇంటెన్సిటీ చూపించాడు రవికిషన్. పాత్రలోనూ వెయిట్ ఉంటే.. ఈ క్యారెక్టర్ జనాలకు ఇన్ స్టంట్ గా ఎక్కేయడం ఖాయం. వరుసగా రెండో సినిమాతోనూ హిట్టు కొట్టాడంటే రవికిషన్ టాలీవుడ్ లో విలన్ గా బిజీ అయిపోవడం ఖాయం.