Begin typing your search above and press return to search.

మహేష్‌ కెమెరామ్యాన్ ఉత్సాపడుతున్నాడు

By:  Tupaki Desk   |   10 Nov 2016 7:21 AM IST
మహేష్‌ కెమెరామ్యాన్ ఉత్సాపడుతున్నాడు
X
దేశంలో టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవి కె చంద్రన్.. ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండడం ఖాయం అయింది. మహేష్ బాబు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడీ ప్రొఫెషనల్ అండ్ స్టైలిస్ట్ ఫోటోగ్రాఫర్. తన ఎంట్రీ పైనే కాదు.. మరో విషయంపైనా బాగా ఉత్సాహం చూపించేస్తున్నాడీ రవి కె. చంద్రన్.

'కొరటాల శివ తీసిన 3 సినిమాలు నాకు విపరీతంగా నచ్చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న మూవీతో.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడం హ్యాపీగా ఉంది ' అంటున్నాడు రవి కె చంద్రన్. మహేష్ బాబు చూపించడంలో.. కొత్త స్టైల్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట ఈ కెమేరామ్యాన్. రీసెంటగా మూవీ స్టార్టింగ్ ఫంక్షన్ కు కూడా అటెండ్ అయిన ఈయన.. దేవిశ్రీ ప్రసాద్.. కొరటాల శివలతో కలిసి దిగిన సెల్ఫీ కూడా పోస్ట్ చేశాడు.

మహేష్ తో అరగంట్రం.. అందులోనూ కొరటాల దర్శకత్వం.. వీటితో పాటు రాక్ స్టార్ అందించే సంగతీ.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవాళ్లు.. ఇంతకన్నా ఏం చూస్తారు.. ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు?ఈ సినిమాటోగ్రాఫర్ సంతోష పడ్డం సహజమేలే!