Begin typing your search above and press return to search.

సెప్టెంబ‌రులో ర‌విబాబు 'అదిగో' అంటాడా?

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:52 PM GMT
సెప్టెంబ‌రులో ర‌విబాబు అదిగో అంటాడా?
X
టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు. న‌టుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ర‌విబాబు....అల్ల‌రి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి అల్ల‌రి చేశాడు. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తూనే ఫుల్ టైం డైరెక్ట‌ర్ గా మారిపోయాడు. సస్పెన్స్ - థ్రిల్ల‌ర్....వంటి విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. మూస సినిమాల‌కు స్వ‌స్తిప‌లికి కొత్తద‌నం కోసం ప్ర‌య‌త్నించే ద‌ర్శ‌కుల‌లో ర‌విబాబు ముందుంటాడు. ఇదే క్ర‌మంలో ర‌విబాబు....పందిపిల్ల‌ లీడ్ రోల్ లో `అదిగో` అంటూ ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా విడుద‌ల‌లో జాప్యం జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రం విడుద‌ల కాబోతోంద‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ లో `అదిగో`ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.

పందిపిల్ల‌తో ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న‌ “అదిగో” పై టాలీవుడ్ లో ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌వ‌ర‌కు టాలీవుడ్ లో అటువంటి నేప‌థ్యంలో సినిమా రాక‌పోవ‌డంతో ....ఇండ‌స్ట్రీలో కూడా ఆ సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఏర్ప‌డింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ర‌విబాబు కూడా....ఆ ఒక్క సినిమాపైనే ఫోక‌స్ చేశాడు. వాస్త‌వానికి గ‌త ఏడాదే `అదిగో` విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, టెక్నిక‌ల్ రీజ‌న్స్ వ‌ల్ల దాని విడుద‌ల‌లో జాప్యం జ‌రిగింది. ఇప్ప‌టికే ఎన్నోసార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం...ఎట్ట‌కేల‌కు సెప్టెంబర్ లో విడుదల కాబోతోంద‌ని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకం’పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌రి, ర‌విబాబు మ‌చ్ అవెయిటెడ్ మూవీ`అదిగో` తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.