Begin typing your search above and press return to search.
వీడియోః లాస్యకు సారీ చెప్పిన రవి.. అయిదేళ్ల తర్వాత అరుదైన కలయిక
By: Tupaki Desk | 5 Jan 2021 7:00 AM ISTతెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన జంట యాంకర్స్ రవి లాస్య అనడంలో సందేహం లేదు. వీరిద్దరికి ఒకరి వల్ల మరొకరికి పేరు వచ్చింది. ఒకానొక సమయంలో వీరిద్దరిని విడదీసి చూడలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నా కూడా వీరిద్దరు కలిసి ఉండేవారు కనిపించే వారు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం కూడా సాగుతుందనే వార్తలు వచ్చాయి. అప్పటికే పెళ్లి అయిన రవి.. లాస్యలు పెళ్లి చేసుకుంటారా అన్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేశాయి. మంజునాధ్ తో అంతకు ముందే పెళ్లి అయినా కూడా లాస్య మళ్లీ పెద్దల ముందు అధికారికంగా పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి లాస్య రవిల జోడీ కనిపించలేదు.
లాస్య పెళ్లి సమయంలో రవి చాలా డిస్ట్రబ్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. కొన్నాళ్లకు రవి తనకు పెళ్లి అయిన విషయాన్ని అధికారికంగా అందరికి చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు కూడా వేరు వేరుగా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వీరిద్దరు మళ్లీ ఎదురు పడతారా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు. దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి జోడీ బుల్లి తెరపై సందడి చేసింది. స్టార్ మాటీవీలో సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం కోసం వీరిద్దరు కలిశారు. వీరు మాత్రమే కాకుండా వీరిద్దరి పిల్లలు కూడా సందడి చేశారు.
ఆ షో కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్యకు షో లో రవి సారీ చెప్పడం మరింతగా వైరల్ అయ్యింది. నిన్ను ఎలాంటి పాయింట్ లో అయినా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు అంటూ రవి చాలా హంబుల్ గా లాస్యకు సారీ చెప్పడంతో లాస్య చిరు నవ్వుతో ఆయన సారిని స్వీకరించడంతో ఇద్దరి మద్య వివాదం సమసి పోయింది అనిపిస్తుంది. ఇక ముందు మళ్లీ వీరిద్దరి జోడీ సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.