Begin typing your search above and press return to search.
సెట్స్ నుండి ఈ స్టార్ హీరోను తరిమేశారట
By: Tupaki Desk | 2 Nov 2018 12:57 PM ISTబాలీవుడ్ లో విభిన్న చిత్రాలకు - విభిన్న పాత్రలకు పెట్టింది పేరైన రణ్ వీర్ సింగ్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లాడు. ఆ టాక్ షోలో పలు ఆసక్తికర విషయాలను రణ్ వీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న ఈయన అప్పట్లో ఒక సినిమా షూటింగ్ సెట్ నుండి తరిమి వేయబడ్డాడట. ఆ విషయాన్ని స్వయంగా రణ్ వీర్ చెప్పుకొచ్చాడు.
కాఫీ విత్ కరణ్ షోలో రణ్ వీర్ మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ - రవీనా టాండన్ జంటగా నంటించిన ఒక చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ సమయంలో నేను ఒక మూలకు కూర్చుని షూటింగ్ ను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా చూస్తూ ఉన్నాను. నా పాటికి నేను కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి సెట్ నుండి నన్ను బయటకు పంపించాడు. షూటింగ్ కు ఇబ్బంది అంటూ నన్ను బయటకు పంపించడంతో నేను చాలా బాధపడ్డాను అంటూ రణ్ వీర్ అన్నాడు.
ఈ విషయమై రవీనా టాండన్ మాట్లాడుతూ.. ఆ సమయంలో అక్షయ్ కుమార్ తో నేను వర్షంలో పాట చిత్రీకరణలో పాల్గొంటున్నాను. పాట చిత్రీకరణ సందర్బంగా కాస్త రొమాన్స్ ఎక్కువ ఉంది. ఆ సమయంలో రణ్ వీర్ చిన్న పిల్లాడు - అసలే తుంటరి అనే ఉద్దేశ్యంతో అక్కడ నుండి పంపించేసినట్లుగా చెప్పుకొచ్చింది. పిల్లలు చెడిపోతారనే ఉద్దేశ్యంతో సెట్ నుండి పంపించేసినట్లుగా రవీనా క్లారిటీ ఇచ్చింది.