Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : రావణాసుర
By: Tupaki Desk | 7 April 2023 11:08 PM'రావణాసుర' మూవీ రివ్యూ
నటీనటులు: రవితేజ-సుశాంత్-అను ఇమ్మాన్యుయెల్-ఫరియా అబ్దుల్లా-మేఘా ఆకాష్-జయరాం-రావు రమేష్-హైపర్ ఆది-హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్
కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ
సోలో హీరోగా 'ధమాకా'తో.. ప్రత్యేక పాత్రలో నటించిన 'వాల్తేరు వీరయ్య'తో ఘనవిజయాలు అందుకుని మంచి ఊపు మీదున్నాడు మాస్ రాజా రవితేజ. ఆయన్నుంచి ఇంతలోనే మరో కొత్త సినిమా వచ్చేసింది. అదే.. రావణాసుర. 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ రూపొందించిన ఈ సినిమా ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను 'రావణాసుర' ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
రవీందర్ (రవితేజ).. తాను కాలేజీ రోజుల్లో ప్రేమించిన సీతామాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గరే జూనియర్ లాయర్ గా పని చేస్తూ కేసులు డీల్ చేస్తుంటాడు. అతడి దగ్గరికి హత్య కేసులో చిక్కుకున్న ఒక ఫార్మా కంపెనీ యజమాని (సంపత్)ని కాపాడమంటూ తన కూతురు (మేఘా ఆకాష్) వస్తుంది. కోర్టులో ఈ కేసును రవీందర్ డీల్ చేస్తున్న సమయంలోనే.. అసిస్టెంట్ కమిషనర్ (జయరాం) ఈ హత్య కేసు విచారణ చేపడతాడు. ఈ హత్య చేసిందే రవీందర్ అని.. ఫార్మా కంపెనీ యజమానిని ఈ కేసులో ఫ్రేమ్ చేసింది కూడా తనే అని ఏసీపీ కనిపెడతాడు. రవీందర్ మరిన్ని హత్యలు చేసినట్లు కూడా నిర్ధారణకు వస్తాడు. మరి రవీందర్ నేపథ్యం ఏంటి.. అతను ఈ హత్యలన్నీ ఎందుకు చేశాడు.. ఈ కేసుల నుంచి అతను బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తనపై క్వింటన్ టొరంటినో.. రామ్ గోపాల్ వర్మ సహా చాలామంది దర్శకుల ప్రభావం ఉందని.. వాళ్ల సినిమాల నుంచి స్ఫూర్తి పొందడమే కాక వారిని కాపీ కొట్టడానికి కూడా వెనుకాడనని తొలి సినిమా స్వామి రారా టైంలో ప్రకటించి అందరికీ పెద్ద షాకిచ్చాడు సుధీర్ వర్మ. ఆ సినిమాతో క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను ఉర్రూతలూగించిన సుధీర్.. ఆ తర్వాత తనపై పెరిగిన అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. ఐతే తన ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా రవితేజ లాంటి పెద్ద హీరో అవకాశం ఇచ్చాడు. మాస్ రాజాతో సినిమా అనేసరికి లాజిక్ తీసి అటక మీద పెట్టేయొచ్చని సుధీర్ బలంగా ఫిక్సయినట్లున్నాడు. కథగా చూసుకుంటే అతడి మార్కు థ్రిల్లరే అయినప్పటికీ.. దాన్ని నరేట్ చేసిన విధానంలో మాత్రం థ్రిల్లర్ ప్రియులు ఆశించే బ్రిలియన్స్ ఇందులో ఏమాత్రం కనిపించదు. సినిమా బోర్ కొట్టించకపోయినా.. తెర మీద జరిగే తంతు నమ్మశక్యంగా అనిపించకపోవడం వల్ల రావణాసురను ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. థ్రిల్లర్ కథను మాస్ స్టయిల్లో చెప్పడం రావణాసురకు అతి పెద్ద మైనస్.
రావణాసుర టీం సీక్రెట్ లాగా దాచి పెట్టిన విషయం ఎలాగూ ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది కాబట్టి.. మరీ లోతుల్లోకి వెళ్లకుండా దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఒక ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని పసిగట్టి.. అతణ్ని బ్లాక్ మెయిల్ చేసి తన శత్రువుల తరహాలో మాస్కులు తయారు చేయించుకుని వాళ్ల ముఖాలతో హత్యలు చేసేస్తుంటాడు హీరో ఇందులో. థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి విషయాలను తెర మీద కొంచెం పకడ్బందీగా చూపించాలని ప్రేక్షకులు ఆశిస్తారు. బిగితో చూపిస్తే బ్రిలియన్స్ అనే ప్రేక్షకులే... కొంచెం అటు ఇటు అయితే వెటకారపు నవ్వులు నవ్వుతారు. రావణాసుర కోర్ పాయింట్ రెండో కోవకే చెందుతుంది. హీరో చాలా సింపుల్ గా హత్యలు చేసి బయటపడే తీరు చూస్తే.. మర్డర్లు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే.. ఈ విషయాన్ని తెరపై డీల్ చేసిన తీరు మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. సినిమాకు అత్యంత కీలకమైన పాయింట్ విషయంలోనూ ప్రేక్షకులు లైట్ అనుకుంటే ఇక సినిమాను ఎలా సీరియస్ గా తీసుకుంటారు?
లాజిక్ సంగతి పక్కన పెడితే.. రావణాసురను బ్యాడ్ మూవీ అనలేం. ఈ సినిమా మరీ బోర్ ఏమీ కొట్టించదు. రెండున్నర గంటల్లో చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. రవితేజ పాత్రను ఉన్నంతలో ఆసక్తికరంగానే తీర్చిదిద్దారు. చివరి అరగంటలో ఆ పాత్ర గురించి అసలు విషయం తెలిసే వరకు హీరో ఇంత దుర్మార్గంగా ఉన్నాడేంటి.. రవితేజ ఇంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎలా చేశాడు అని ఆశ్చర్యం కలుగుతుంది. టైటిల్ కు తగ్గట్లే ఒక విలన్ లాగా ఆ పాత్రను ప్రెజెంట్ చేశాడు సుధీర్ వర్మ. ఆరంభ సన్నివేశాల్లో చాలా మామూలు సినిమాలా కనిపిస్తుంది రావణాసుర. రవితేజ.. హైపర్ ఆది కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో కొన్ని పంచులు పేలినా.. కాసేపు సినిమా నత్తనడకన సాగుతుంది. ఐతే హీరోలోని నెగెటివ్ యాంగిల్ బయటికి వచ్చాక రావణాసుర ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రి ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది.
హీరో వేషాలేసుకుని హత్యలు చేస్తూ ఈజీగా బయటపడిపోయే క్రమం సిల్లీగా అనిపించినా.. కథలోని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో తనను ఫ్రేమ్ చేయాలని చూసే ఏసీపీని హీరో బోల్తా కొట్టిస్తూ హత్య కేసులో ఇరికించే ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. హీరోను ఎంత నెగెటివ్ గా చూపించినా.. చివరికి అతడి బ్యాక్ స్టోరీ తెలిశాక అభిప్రాయం మారిపోవడం మామూలే. హీరో హత్యలు చేయడానికి చూపించిన కారణం ఓకే అనిపిస్తుంది. కానీ ఈ సన్నివేశాల్లో ఇంకొంచెం డీటైలింగ్ అవసరం అనిపిస్తుంది. పతాక సన్నివేశాలను కూడా సుధీర్ వర్మ ఓవర్ ద టాప్ స్టయిల్లోనే లాగించాడు. మాస్ ప్రేక్షకులను.. రవితేజ అభిమానులను రావణాసుర కొంత మేర ఎంగేజ్ చేయొచ్చు కానీ.. సుధీర్ వర్మ నుంచి ఒక పకడ్బందీ థ్రిల్లర్ ఆశించే వారికి నిరాశ తప్పదు.
నటీనటులు:
రవితేజ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను అలవోకగా చేసేశాడు. వేరియేషన్లను బాగా చూపించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నెగెటివ్ షేడ్స్ ను పండించిన విధానం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. రవితేజ పాత్రలో ఇంత నెగెటివిటీ ఏంటి అని ముందు ఆశ్చర్యపోయినా.. తర్వాత పాత్రలోని అసలు కోణం అర్థమయ్యాక కన్విన్స్ అవుతాం. పెర్ఫామెన్స్ పరంగా రవితేజకు ఏమీ వంక పెట్టడానికి వీల్లేదు. కానీ ఆయన లుక్స్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్లంటూ ఎవరూ లేరు. అను ఇమ్మాన్యుయెల్ మరీ నామమాత్రమైన పాత్రలో కనిపించింది. ఫరియా అబ్దుల్లాకు కాస్త చెప్పుకోదగ్గ రోల్ పడింది. ఆమె రవితేజ పక్కన సూట్ కాలేదు. మేఘా ఆకాష్ హావభావాలు మరీ పేలవంగా ఉన్నాయి. జయరాం కీలక పాత్రలో రాణించాడు. హైపర్ ఆది కొన్ని పంచులతో నవ్వించాడు. రావు రమేష్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు క్లిక్ కాలేదు. శ్రీరామ్.. సంపత్.. మురళీ శర్మ.. హర్షవర్ధన్.. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
రావణాసురకు సంగీతం పెద్ద మైనస్. హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు ఒక్కటీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. సూర్య ఐపీఎస్ నుంచి రీమిక్స్ చేసిన వెయ్యొన్నొక్క జిల్లాల పాట తేలిపోయింది. సినిమాలో ఆ పాట టైమింగ్.. ప్రెజెంటేషన్ కూడా పేలవం. భీమ్స్ కంపోజ్ చేసిన ఏకైక పాట కూడా మామూలుగానే అనిపిస్తుంది. హర్షవర్ధన్ నేపథ్య సంగీతం కూడా ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీకాంత్ విస్సా కథ బాలేదని చెప్పలేం. అలా అని గొప్పగానూ లేదు. అతడి మాటలు కొన్ని చోట్ల పేలాయి. సుధీర్ వర్మ కెరీర్లో ఎక్కువగా ఫెయిల్యూర్లే ఉన్నా దర్శకుడిగా ఒక ముద్ర కనిపించేది. కానీ గత సినిమాలతో పోలిస్తే కొంచెం ఎంగేజ్ చేసే సినిమానే తీసినా.. దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటలేకపోయాడు. హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ల ప్రభావం తనపై బాగా ఉన్నట్లు చెప్పే సుధీర్.. రావణాసుర విషయంలో లాజిక్ అనే మాటే పట్టించుకోకుండా ఓవర్ ద టాప్ స్టయిల్లో సినిమా తీయడం ఆశ్చర్యం కలిగించే విషయం. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.
చివరగా: రావణాసుర.. థ్రిల్లర్ కథకు మాస్ 'మాస్క్'
రేటింగ్-2.25