Begin typing your search above and press return to search.

ఫ్యాన్సీ రేటుకు 'రావ‌ణాసుర' ఆడియో రైట్స్..!

By:  Tupaki Desk   |   23 April 2022 2:30 PM GMT
ఫ్యాన్సీ రేటుకు రావ‌ణాసుర ఆడియో రైట్స్..!
X
మాస్ మహారాజా ర‌వితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రావ‌ణాసుర''. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నారు. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే 'రావ‌ణాసుర' సినిమా నుంచి విడుదలైన రవితేజ - సుశాంత్ ఫస్ట్ లుక్స్‌ కి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో షూటింగ్ దశలోనే ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఆడియో హక్కులను ప్రఖ్యాత మ్యూజిక్ లేబుల్ కంపెనీ 'సరిగమ సౌత్' సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'రావణాసుర' చిత్రానికి హర్ష వర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరిలియో కలిసి సంగీతం సమకూరుస్తున్నారు. సరిగమ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ ఆల్బమ్ మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇది రవితేజ కెరీర్‌ లోనే హైయెస్ట్ అని.. త్వరలో మ్యూజికల్ జర్నీ ప్రారంభమవుతుందని చిత్ర బృందం తెలిపింది.

స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాపులర్ నటీనటులు - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఇందులో భాగం అవుతున్నారు.

అను ఇమాన్యుయేల్ - మేఘా ఆకాష్ - ఫరియా అబ్దుల్లా - దక్ష నగార్కర్ - పూజిత పొన్నాడ వంటి ఐదుగురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా 'రావణాసుర' చిత్రానికి పవర్‌ ఫుల్ కథ అందించడంతో పాటు మాటలు - స్ర్కీన్‌ ప్లే సమకూరుస్తున్నారు.