Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాకు మెగా సినిమాటోగ్రాఫర్?

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:32 PM GMT
మహేష్ సినిమాకు మెగా సినిమాటోగ్రాఫర్?
X
మహేష్ బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' రీసెంట్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాకు ఇంకా సినిమాటోగ్రాఫర్ ను ఫైనలైజ్ చెయ్యలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకోసం రత్నవేలును సినిమాటోగ్రాఫర్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట. డైరెక్టర్ సుకుమార్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన రత్నవేలు ఆయన సినిమాలకు అన్నిటికీ పని చేస్తాడు. అవే కాకుండా 'రోబో'.. 'ఖైది నెం.150'.. లాంటి క్రేజీ ప్రాజెక్టులకు పని చేశాడు. తాజాగా మెగాస్టార్ చిత్రం 'సైరా' కు పనిచేస్తున్నాడు. 'సైరా' షూటింగ్ దాదాపుగా చివరి దశలో ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్ కు వెళ్ళే సమయానికి 'సైరా' పూర్తయ్యే పక్షంలో రత్నవేలు ఈ సినిమాకు పని చేసేందుకు అంగీకరించాడట. అయితే ఈ విషయంపై రెండు రోజుల్లో కన్ఫాం చేస్తానని 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ కు చెప్పాడని సమాచారం.

మహేష్ సినిమాకు పనిచేయడం రత్నవేలుకు ఇది మొదటి సారి కాదు. సుకుమార్ - మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన '1-నేనొక్కడినే' కు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి చిత్రం ఫైనలైజ్ అయితే మహేష్ తో పని చేయడం రెండోసారి అవుతుంది.