Begin typing your search above and press return to search.

రత్నవేలుకు ఆ రేంజులో నచ్చేసింది

By:  Tupaki Desk   |   19 Oct 2016 6:05 PM GMT
రత్నవేలుకు ఆ రేంజులో నచ్చేసింది
X
మెగాస్టార్ చిరంజీవి మెగా రీఎంట్రీ ఇస్తున్న మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మెగా మూవీపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కి మహా హుషారు తెప్పించేస్తోంది ఖైదీ యూనిట్. ఈ మూవీలో ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ కొన్ని రోజులుగా జరుగుతుండగా.. ఇప్పుడా సాంగ్ షూటింగ్ పూర్తయిపోయింది.

'పాట షూటింగ్ పూర్తయింది. బాస్ ఈజ్ బ్యాక్.. మెగా స్టార్ డ్యాన్స్ - డీఎస్పీ ఇచ్చిన ట్యూన్ కి.. ఫ్యాన్స్ ఆనందంతో పిచ్చెక్కిపోవడం ఖాయం. చిరంజీవి సార్ ఇచ్చిన హగ్ కి థాంక్యూ' అంటూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ పెట్టి మరీ సాంగ్ షూటింగ్ పూర్తయిన విషయం చెప్పాడు. మరోవైపు ఖైదీ నెం.150 యూనిట్ కూడా.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మాస్ డ్యాన్స్ నెంబర్ షూటింగ్ పూర్తయిందంటూ చెప్పేసింది. మెగా స్టార్ చిరంజీవి.. ఐటెం భామ లక్ష్మీ రాయ్.. డ్యాన్స్ కంపోజర్ రాఘవ లారెన్స్ ల ఫోటో పోస్ట్ చేసి.. కాంబినేషన్ కూడా చూపించారు లెండి.

లారెన్స్ కంపోజ్ చేయగా.. మెగాస్టార్ ఇంద్ర సినిమాలో వేసిన వీణ స్టెప్ ను ఇప్పటికీ ఎప్పటికీ మెగా ఫ్యాన్స్ మర్చిపోవడం అసాధ్యం. మళ్లీ ఇప్పుడు అంతకు మించిన స్టెప్స్ ను లారెన్స్ మెగాస్టార్ తో వేయించేశాడనే లీకులు వస్తుండడంతో.. ముందు ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/