Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టారైనా..చిన్న హీరో అయినా..ఒకటే

By:  Tupaki Desk   |   19 Nov 2015 1:54 PM GMT
సూపర్‌ స్టారైనా..చిన్న హీరో అయినా..ఒకటే
X
ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషియన్లలో రత్నవేలు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ గా ప్రతిభావంతుడిగా గుర్తింపు ఉన్న రత్నవేలు.. తన ప్రతీ సినిమాకీ ఖచ్చితంగా టెస్ట్ షూట్ చేసి తీరతానని చెబ్తున్నాడు. ప్రస్తుతం కుమారి 21 ఎఫ్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన ఈయన.. తనకు రజినీకాంత్ అయినా రాజ్ తరుణ్ అయినా ఒకటేనని చెబ్తున్నాడు.

కెమేరాకి సినిమాకి ఏది బెస్ట్ అయితే, అదే చేస్తానని అందుకే తన వర్క్ ని డైరెక్టర్స్ ఇష్టపడతారని చెప్పాడు. అంతే కాదు. తాను స్క్రిప్ట్ ను రెండు, మూడు సార్లు పూర్తిగా చదవడంతోనే.. ఆ డైరెక్టర్ - రైటర్ల వ్యూ ఏమిటో అర్ధం చేసుకుంటానని చెప్పాడాయన. సుకుమార్ తో కలిసి ఆర్య నుంచి ప్రయాణం చేస్తున్న రత్నవేలు.. సుక్కు బ్రిలియంట్ టెక్నీషియన్ అంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్ - తను మంచి ఫ్రెండ్స్ గా చెప్పాడు రత్నవేలు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం - రోబో2 చిత్రాలకు అంగీకరించిన ఈయనకు.. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున మాత్రమే మూవీస్ చేసే అలవాటు ఉంది. బ్రహ్మోత్సవం కంప్లీట్ అయాకే రోబో2 సెట్స్ పైకి వెళ్లనున్నాడు. తను ఇబ్బంది పడి, ఇతరులను పెట్టడం తనకు ఇష్టం లేదన్నాడు రత్నవేలు.

కుమారి 21 ఎఫ్ విషయానికొస్తే.. ఇద్దరూ ప్రతిభావంతులైన నటులు అన్న రత్నవేలు.. తను ఓ మూవీకి ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తానని అన్నాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పాడు.