Begin typing your search above and press return to search.

సైరా.. చాలా సార్లు కోప్పడ్డాను: రత్నవేలు

By:  Tupaki Desk   |   6 Sept 2019 12:29 PM IST
సైరా.. చాలా సార్లు కోప్పడ్డాను: రత్నవేలు
X
సౌత్ లో ఉండే టాప్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. సుకుమార్ తెరకెక్కించే ప్రతిసినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తారనే సంగతి తెలిసిందే. రత్నవేలు ఖాతాలో 'రోబో' లాంటి బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి 'సైరా' చిత్రానికి పనిచేస్తున్నారు. ఒక జోనర్ సినిమాలకు పరిమితం కాకుండా ఆయన ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలకు పనిచేస్తుంటారు.

రీసెంట్ గా ఈ విషయంపై మాట్లాడుతూ దర్శకుడు శంకర్ షూటింగ్ స్టైల్ కు తను అలవాటు పడ్డానని చెప్పారు. శంకర్ 20 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తారని.. తర్వాత ఓ పదిరోజులు బ్రేక్ ఇస్తారని చెప్పాడు. అయితే 'సైరా' కోసం కంటిన్యూగా పనిచేయాల్సి వచిందని.. వర్క్ ఎక్కువ కావడంతో కొన్నిసార్లు సెట్ లో కొప్పడ్డానని ఓపెన్ గా చెప్పారు. అయితే తనను ఎవరూ ప్రెజర్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. సైరా లాంటి పెద్ద స్పాన్ ఉన్న ప్రాజెక్ట్.. హై బడ్జెట్ ఫిలిం ను హ్యాండిల్ చేసే సమయంలో అవుట్ పుట్ విషయంలో ఆందోళన చెందడం సహజమే. అందులోనూ క్వాలిటీ కోసం తపించే రత్నవేలు లాంటి టెక్నిషియన్ అలా షూటింగ్ సమయంలో కోప్పడడం కామనే కదా.

ఖైది నెం. 150 సమయంలోనే చిరంజీవి గారితో.. చరణ్ తో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 'సైరా' పూర్తయింది కాబట్టి ఇప్పుడు రత్నవేలు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ కు పని చేస్తారో వేచి చూడాలి. మరోసారి సుకుమార్ సినిమాకు పనిచేస్తారా లేదా అనేది ఆసక్తికరం. ఇదిలా ఉంటే 'సైరా' అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధం అవుతోంది.