Begin typing your search above and press return to search.
ఆల్రెడీ పెళ్లయినవాడితో ఆ దాగుడుమూతలేంటి రాశీ?
By: Tupaki Desk | 25 Jan 2021 3:20 PM ISTఅందాల రాశీ ఖన్నా.. తెలుగు సినిమాల్లో నటిస్తూ హైదరాబాద్ లో స్థిరపడిన సంగతి తెలిసినదే. అయితే ఇటీవల తన కెరీర్ ఇక్కడ ఆశించినంత రేంజులో లేదు. ఆ క్రమంలోనే అటు తమిళం .. హిందీలోనూ ఛాన్సులొస్తే అంగీకరిస్తోంది.
అడపాదడపా సినిమా ఆఫర్లు ఉన్నా.. వెబ్ సిరీస్ అవకాశాల్ని వదులుకోవడం లేదు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన రాశీ ఖన్నా ఓ వెబ్ సిరీస్ లో నాయికగా నటిస్తోంది. దీంతో బాలీవుడ్ కి బౌన్స్ బ్యాక్ అవుతోందా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి మద్రాస్ కేఫ్ అనే చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రాశీ ఆ తర్వాత అవసరాల- శౌర్యల పిలుపు మేరకు టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక్కడ పెద్ద స్టార్ గా ఎదిగింది.
ఇప్పుడు మళ్లీ హిందీ పరిశ్రమలో ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డికె దర్శకత్వంలోని ఒరిజినల్ సిరీస్ కి సంతకం చేసింది. ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షాహిద్ తో కలిసి ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న రాశీ ఇదిగో ఇలా సెల్ఫీని షేర్ చేసింది. ఆ సెల్ఫీలో రాశీ వెనకగా షాహిద్ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. ఎందుకలా దాక్కుంటున్నావ్ షాహిద్? ఐ యామ్ సో ఇంటిమిడేటింగ్.. అంటూ రాశీ ఖన్నా ఈ రేర్ ఫోటోని షేర్ చేసింది.
అయినా ఆల్రెడీ పెళ్లయిన షాహిద్ ఇలా హైడ్ గేమ్స్ ఆడడం సరికాదేమో రాశీ? అంటూ ఈ ఫోటోకి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. రాశి ప్రస్తుతం తమిళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తమిళ హీరో విజయ్ సేతుపతి తోనూ నటించే అవకాశం దక్కించుకుంది.