Begin typing your search above and press return to search.

'మన్మథుడు 2' దర్శకుడితో రష్మిక..?

By:  Tupaki Desk   |   12 Sept 2021 5:00 AM IST
మన్మథుడు 2 దర్శకుడితో రష్మిక..?
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోలతో ఆడిపాడుతోంది. ప్రస్తుతం తెలుగులో 'పుష్ప' వంటి పాన్ ఇండియా సినిమాతో పాటుగా 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. 'మిషన్ మజ్ను' 'గుడ్ బై' సినిమాలు చేస్తోంది. ఈ నాలుగు చిత్రకు సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో తెలుగు ప్రాజెక్ట్ కు సైన్ చేసిందని.. అది కూడా ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా అని వార్తలు వస్తున్నాయి.

'అందాల రాక్షసి' 'టైగర్' 'అలా ఎలా' వంటి సినిమాలతో నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్.. 'చిలసౌ' చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించి.. డైరెక్టర్ గా రాహుల్ కు ఫస్ట్ సక్సెస్ అందించింది. దీంతో రెండో సినిమాకే ఏకంగా సీనియర్ స్టార్ హీరో నాగార్జునతో వర్క్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన 'మన్మథుడు 2' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో విమర్శలపాలైన రాహుల్ రవీంద్రన్..ఛాన్స్ వస్తే ఈసారి సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.

రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా చేయనున్నట్టు గీతా ఆర్ట్స్2 ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇదొక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని టాక్ నడుస్తోంది. రాహుల్ చెప్పిన పాయింట్ మెచ్చిన గీతా ఆర్ట్స్.. దర్శకుడు అడిగిన స్టార్ క్యాస్టింగ్ ని ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఈ నేపథ్యంలో కీలకమైన హీరోయిన్ పాత్ర కోసం ర్రష్మిక మందన్నా అయితే బాగుంటుందని.. ఆమెను సంప్రదించారట. పెద్ద బ్యానర్.. అందులోనూ కథ నచ్చడటంతో రష్మిక కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.