Begin typing your search above and press return to search.

బిగ్ బి తో రష్మిక.. ఫోటో షేర్ చేసిన అందాల భామ

By:  Tupaki Desk   |   1 April 2022 10:32 AM GMT
బిగ్ బి తో రష్మిక.. ఫోటో షేర్ చేసిన అందాల భామ
X
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన్న. ఆ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత నార్త్ లోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. పుష్ప ది రైజ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య బాద్ షా పాట లోనూ నటించిన ఈ అమ్మడు తెలుగు, కన్నడ తో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది రష్మిక.

రష్మిక మందన్నా సోషల్ మీడియా సైట్లలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ తన సినీ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వేదికల్లో పోస్టులు పెడుతూ నిత్యం అభిమానులకు దగ్గరగానే ఉంటుంది ఈ భామ. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, కొత్త సినిమా ప్రచారాలతో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికల ద్వారా కాస్తం సమయం పాటు అభిమానులతో లైవ్ లో ముచ్చటిస్తుంది.

పుష్ప లాంటి భారీ హిట్ కొట్టిన తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రష్మిక మందన్నా. ఈ క్రమంలోనే బాలీవుడ్ చిత్రాల షూటింగ్ నిమిత్తం గత కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగానే ముంబయిలోనే ఉంటోంది.

పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె మిషన్ మజ్ను, గుడ్ బై అనే రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. గుడ్ బై చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తుండటం విశేషం.

ఈ సినిమాలో బిగ్ బి తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి దిగిన ఓ ఫోయో ను ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు.

ఆయన వారిద్దరికీ ఏదో సీన్ గురించి వివరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఫోటోను ఇన్ స్టాలో పోస్టు చేసిన మందన్న.. దాని కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఓన్లీ అండ్ ఓన్లీ గ్రాటిట్యూడ్ స్మైల్స్ అండ్ లవ్ అంటూ అమితాబ్ బచ్చన్ తో ఉన్న ఫోటో కు క్యాప్షన్ ఇచ్చింది.