Begin typing your search above and press return to search.

2020 ర‌ష్మిక నామ సంవ‌త్స‌రం

By:  Tupaki Desk   |   30 Dec 2019 5:17 AM GMT
2020 ర‌ష్మిక నామ సంవ‌త్స‌రం
X
2020 బెస్ట్ హీరోయిన్ ఎవ‌రు? ఇంత‌కీ ఏ అందాల భామ ఈ కొత్త సంవ‌త్స‌రాన్ని త‌న ఖాతాలో వేసుకోబోతోంది? అంటే.. ఎలాంటి డౌట్ లేకుండా ర‌ష్మిక పేరు వినిపిస్తోంది. ఛ‌లో - గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ తో ర‌ష్మిక బ్రాండ్ వ్యాల్యూ అమాంతం స్కైని ట‌చ్ చేసింది. ఆ క్ర‌మం లోనే 2019లో మ‌హేష్- నితిన్- అల్లు అర్జున్ లాంటి స్టార్లు పిలిచి మ‌రీ అవ‌కాశాలిచ్చారు. ర‌ష్మిక లాంటి ల‌క్కీ హ్యాండ్ లేనిదే తాము సినిమా చేయ‌లేమ‌ని ఫిక్స‌యిపోయారు ఈ హీరోలంతా.

ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` రిలీజ్ కి వ‌స్తోంది. 2020 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే నితిన్ స‌ర‌స‌న న‌టించిన భీష్మ కూడా 2020 ప్ర‌థ‌మార్థం(ఫిబ్ర‌వ‌రి 21న)లోనే రిలీజ‌వుతోంది. అంటే ఇక‌పై ర‌ష్మిక‌ కు క్ష‌ణం తీరిక ఉండ‌ద‌న్న‌మాట‌. ఇప్పటి నుంచే పూర్తిగా ప్ర‌చారం తో బిజీ కానుంది. అందుకే కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ కోసం పెద్ద బ్రేక్ ఏదీ తీసుకోకుండా ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుంటోంద‌ట‌. డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ ట్రీట్ ఎక్క‌డ‌? అన్న‌ది మాత్రం రివీల్ కాలేదింకా.

ర‌ష్మిక న‌టిస్తున్నవి రెండూ క్రేజీ సినిమాలు. పైగా మ‌హేష్ స‌ర‌స‌న భారీ చిత్రంలో న‌టిస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలో ఈ సినిమాని పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ చేస్కోవాల‌నే ఆలోచ‌న‌ తో ఉంద‌ట‌. ఇది గానీ హిట్ట‌యితే త‌న రేంజు ఒక్క‌ సారిగా స్కైని ట‌చ్ చేస్తుంది. అటుపై ఒక్కో సినిమా కి స్టార్ హీరోయిన్ రేంజు లో కోటి ఎలా గుంజాలి? అన్న ప్లాన్ లోనూ ర‌ష్మిక ఉంద‌ట‌. స‌రిలేరు నీకెవ్వ‌రు టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేస్తే చాలు.. త‌న‌ క్రేజు ఆటోమెటిగ్గా పెరుగుతుంది. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌ లో హిట్టు ఒక్క‌టే ముఖ్యం కాబ‌ట్టి అది వ‌చ్చిన త‌ర్వాత తాను ఎంత చెబితే అంతే. అటుపైనా కెరీర్ ని ఇంకా తెలివిగా ప్లాన్ చేయ‌నుంద‌ట‌. ఇక ప్ర‌చారం అంతా ఈ రెండు నెల‌ల్లోనే ఉంటుంది కాబ‌ట్టి అన‌వ‌స‌రమైన‌ సెల‌వులు తీసుకోద‌ట‌. ఇక ఈ షెడ్యూల్ తో పాటుగా.. అల్లు అర్జున్ - సుక్కూ కాంబినేష‌న్ మూవీ సెట్స్ కి జాయిన్ కావాల్సి ఉంద‌ని తెలుస్తోంది. అంటే ఒకే ఏడాది లో మూడు క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది కాబ‌ట్టి 2020ని ర‌ష్మిక నామ సంవ‌త్స‌రం గా డిక్లేర్ చేసేస్తున్నారు ఫ్యాన్స్.