Begin typing your search above and press return to search.

గణపతి దర్శనానికి ఇలాంటి డ్రెస్ లోనా రష్మికా..?

By:  Tupaki Desk   |   7 Sep 2022 7:41 AM GMT
గణపతి దర్శనానికి ఇలాంటి డ్రెస్ లోనా రష్మికా..?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెడుతోంది. 'గుడ్ బై' సినిమాతో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. వికాస్ బాహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించింది రష్మిక.

నిన్న మంగళవారం ముంబైలో జరిగిన 'గుడ్ బై' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రష్మిక పాల్గొంది. ఈ సందర్భంగా గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో తన స్పైసీ అప్పీయరన్స్ తో సౌత్ సైరన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కోటు టైప్ ష్రగ్ టాప్ తో మల్టీ-కలర్ ప్రింటెడ్ లెహంగా ధరించి అద్భుతంగా కనిపించింది.

రివీలింగ్ కాస్ట్యూమ్స్ లో సెక్స్ అప్పీల్ ను ప్రదర్శించడంతో కెమెరా కళ్లనీ నేషనల్ క్రష్ వైపు తిరిగాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత రష్మిక నగరంలోని చారిత్రాత్మక లాల్ బాగ్చా రాజా పండల్ లోని గణపతిని దర్శనం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.

అయితే రష్మిక మందన్నా ట్రైలర్ లాంచ్ కోసం ధరించిన అదే డ్రెస్ లో ప్రసిద్ధ లాల్ బాగ్చా వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది. ఆమె ఇక్కడ తన కోట్ బటన్ ను పెట్టుకొని కనిపించినప్పటికే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

రష్మిక ధరించిన డీప్-నెక్ రివీలింగ్ అవుట్ ఫిట్ పై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కిన్ షో చేయకుండా గణేశుడిని దర్శించుకోవడానికి మంచి దుస్తులు ధరించి ఉండాల్సిందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే 'గుడ్ బై' ట్రైలర్ లాంచ్ లో రష్మిక పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. 'మీ జీవితంలో ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ ప్రశ్నించగా.. 'నెగెటివ్ ఆలోచనలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చింది.

'నేను చాలా పాజిటివ్ పర్సన్ ని. దేన్నైనా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాను. మనందరం కూడా నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలి. ఈ ప్రపంచమంతా పాజిటివ్ నెస్ తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

కాగా, 'గుడ్ బై' సినిమాతో పాటు పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ రష్మిక పైప్ లైన్ లో ఉన్నాయి. శంతను బాగ్చి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రణబీర్ కపూర్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న 'యానిమల్' మూవీలోనూ నటిస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న 'పుష్ప: ది రూల్' సినిమాలోనూ రష్మిక కొనసాగనుంది. మరో రెండు రోజుల్లో 'పుష్ప 2' షూటింగ్‌ లో జాయిన్‌ కానున్నట్లు ఆమె తెలిపింది. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న 'వారసుడు' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో లక్కీ బ్యూటీ హీరోయిన్ గా కనిపించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.