Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్ వల్ల రష్మిక కు తోడు దొరికిందట

By:  Tupaki Desk   |   30 Aug 2021 6:00 PM IST
లాక్‌ డౌన్ వల్ల రష్మిక కు తోడు దొరికిందట
X
ఈమద్య కాలంలో సెలబ్రెటీలతో పాటు సామాన్యలు అంతా కూడా పెట్ డాగ్స్‌ ను పెంచుకుంటూ ఉన్నారు. స్థాయిని బట్టి పెట్‌ డాగ్స్ ఉంటున్నాయి. ఎన్నో రకాల బ్రీడ్స్ ఉంటున్నాయి. సెలబ్రెటీల పెట్స్ కూడా సెలబ్రెటీలే. టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న పెట్‌ డాగ్‌ ఆరా కూడా సెలబ్రెటీ అనడంలో సందేహం లేదు. రష్మిక షూటింగ్‌ కోసం ఎక్కడకు వెళ్తే అక్కడకు ఇది కూడా వెళ్తోంది. పెట్ డాగ్స్ కు ఈ మద్య కాలంలో సోషల్‌ మీడియాలో మంచి పేరు ఉన్న నేపథ్యంలో చాలా మంది రష్మిక మందన్నా యొక్క పెట్‌ డాగ్ అయిన ఆరా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా ఒక చిట్ చాట్‌ లో తన పెట్‌ డాగ్ గురించిన విషయాన్ని తెలియజేసింది. తాను ఎటు వెళ్లినా కూడా పెట్‌ ఉండాల్సిందే అని.. అది లేకుంటే తాను ఉండలేక పోతున్నాను అంటుంది.

తన వద్దకు ఆరా ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి ఆమె స్పందిస్తూ.. కరోనా వల్ల లాక్ డౌన్ ను విధించారు. ఆ సమయంలో లాక్ డౌన్ వారం పది రోజులే ఉంటుందని ఆమె భావించి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. అలా ఆమె హైదరాబాద్‌ లోనే లాక్ డౌన్ సమయంలో ఉండి పోయింది. వారాలు దాటి నెలలు గడిచి పోతున్నా కూడా లాక్ డౌన్‌ వల్ల రష్మికకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లే అవకాశం దక్కలేదు. దాంతో ఆమె ఒంటరితనంతో ఇబ్బంది పడి చివరకు ఒక పెట్‌ ను తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఆరా ను తెచ్చిందట.

ఆరా తన వద్దకు వచ్చినప్పటి నుండి చాలా ప్రశాంతంగా ఉంటుందని.. మానసిక సంఘర్షణ లేకుండా ఉంటుందని.. ఆరాతో కొంత సమయం గడిపితే చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆరా తనకు ఎంతో ముఖ్యం అని చెప్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో పుష్ప తో పాటు మరి కొన్ని సినిమాలు ఇంకా బాలీవుడ్‌.. కోలీవుడ్‌ మరియు కన్నడంలో కూడా సినిమాల్లో నటిస్తుంది. ఇన్ని భాషల్లో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నా తన ఫ్రీ టైమ్ ను ఆరాతో గడిపేందుకు ఇష్టపడుతుందట. ఆమె తన ఆరా గురించి సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూనే ఉంది.