Begin typing your search above and press return to search.
అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోయే బ్యూటీ...?
By: Tupaki Desk | 3 July 2020 4:00 PM ISTఅక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పరశురామ్ పెట్లా డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేవు. ఈ క్రమంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య తన తదుపరి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 'థాంక్యూ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని.. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని సమంత నటించనుందని వార్తలు వచ్చాయి.
అయితే అది నిజం కాదని ఈ మూవీ లో చైతూ సరసన మహానటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లు టాక్ వచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' 'రంగ్ దే' ' సర్కారు వారి పాట' సినిమాలలో నటిస్తోంది. ఈ నేపథ్యం లో కీర్తి ఈ సినిమా లో నటించే ఛాన్స్ లేదని అనుకున్నారు. అంతే కాకుండా 'పెంగ్విన్' మూవీ ఫలితం నిరాశపరచడంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అంతేకాకుండా చైతూ మూవీ కోసం లక్కీ బ్యూటీ రష్మిక మందన్న పేరును కూడా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక నాగ చైతన్య సైతం రష్మిక పేరునే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. 'భీష్మ' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల విజయాల తో దూకుడు మీదున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమా లో నటిస్తోంది. మరి ఈ మూవీ లో అక్కినేని వారసుడి పక్కన ఏ బ్యూటీ నటించబోతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.