Begin typing your search above and press return to search.

ఈసారి కామ్రేడ్ కోసం శ్రీవల్లి ఐటెం సాంగ్‌

By:  Tupaki Desk   |   5 July 2022 5:14 AM GMT
ఈసారి కామ్రేడ్ కోసం శ్రీవల్లి ఐటెం సాంగ్‌
X
గీత గోవిందం.. డియర్‌ కామ్రేడ్ సినిమాల్లో నటించి మంచి స్నేహితులుగా మారిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ల గురించి సోషల్‌ మీడియాలో... వెబ్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేయడం జరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలను ఇద్దరు కూడా కొట్టిపారేయడం జరిగింది.

అయినా కూడా ఏదో మ్యాటర్ ఉంది అనే వార్తలు మాత్రం చాలా రోజులుగా రావడం మానడం లేదు. మరో వైపు వీరిద్దరి కాంబో సినిమా కోసం సినీ ప్రేక్షకులు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కల పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న జనగణమన సినిమాతో నెరవేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతున్న జనగణమన సినిమా లో రష్మిక మందన్నా కనిపించబోతుంది. హీరోయిన్ గా కాకుండా రౌడీ స్టార్‌ కోసం ఐటెం సాంగ్‌ ను రష్మిక మందన్నా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా లో హీరోయిన్ గా నటించడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెల్సిందే.

అందుకే రష్మిక మందన్నా ఐటెం సాంగ్‌ ఖచ్చితంగా జనగణమన కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. లైగర్ సినిమా తో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ మరో వైపు ఖుషి సినిమాను చేస్తున్నాడు. జనగణమన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా శరవేగంగా జరుగుతోంది.

హీరోగా విజయ్‌ దేవరకొండ కు ఉన్న క్రేజ్ తో జనగణమన సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు పూరి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. మహేష్ బాబుతో ఈ సినిమాను పూరి చేయాలని భావించాడు. కాని మహేష్‌ డేట్లు దొరక్క పోవడంతో డబుల్‌ కసితో విజయ్ దేవరకొండతో సినిమా ను చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

సినిమా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తూ ఉండటం తో ప్రతి విషయంలో కూడా చాలా భారీగా ఆలోచిస్తున్నాడు. అందుకే ఐటెం సాంగ్‌ ను అత్యంత ఖర్చు పెట్టి రష్మిక తో చేయాలని భావిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. జనగణమన సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందట. క్రేజీ కపుల్‌ ఐటెం సాంగ్‌ లో కనిపించినా కూడా ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం.