Begin typing your search above and press return to search.

గీతకు.. ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టమో తెలుసా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 11:30 AM GMT
గీతకు.. ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టమో తెలుసా?
X
తక్కువ వ్యవధిలో ఎక్కువ ఇమేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. తన తొలి సినిమాలో ‘గీత’గా పరిచయమై.. మనసు దోచేసిన ఈ ముద్దుగుమ్మ.. నవ్వినప్పుడు మాత్రమే కాదు.. కొర కొర చూసినప్పుడు కూడా క్యూట్ గా ఉంటుందని ఆమె అభిమానులు తెగ మురిసిపోతుంటారు. అభినయం మాత్రమే కాదు అదృష్టం సైతం టన్నుల కొద్దీ తన వెంట ఉంచుకునే అతి కొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు.

తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా తమిళం.. హిందీ.. ఇలా తాను ఎంట్రీ ఇచ్చిన భాషల్లో దుమ్ము లేపుతున్న రష్మిక.. తాజాగా తెలుగులో పుష్ప.. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తోంది. తన అందచందాలతో యూత్ కు నిద్ర లేని రాత్రుల్ని మిగులుస్తున్న ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ కు పండుగ లాంటి టైమిచ్చింది.

చాలామంది చెప్పిన రీతిలోనే సమాధానాలు చెప్పిన రష్మిక.. రెండు.. మూడు కొత్త విషయాల్ని చెప్పింది. అందులో అందరూ కనెక్టు అయ్యే విషయం.. ఆమెకు నచ్చే అబ్బాయిలు ఎలా ఉండాలనే దాని మీద ఆమె ఓపెన్ అయ్యింది. మంచి వ్యక్తిత్వంతో పాటు.. డబ్బుల విషయంలోనూ పొదుపుగా ఉండే అబ్బాయిలు తనకు బాగా నచ్చుతారని చెప్పింది. నిజానికి గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ ఫుల్ గా ఉండే ఏ హీరోయిన్ చెప్పని మాటగా దీన్నిచెప్పాలి. అదే సమయంలో.. తన చుట్టుపక్కల ఎవరైనా సిగిరెట్ కాలిస్తే అసౌకర్యంగా ఉంటుందని పేర్కొంది.

అభిమానులు అడిగిన మరో ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది. దేవుడు ప్రత్యక్షమై.. ఒకే ఒక్క కోరికను తీర్చే వరమిస్తే.. ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. లోకంలోని బాధనంతా మటుమాయంచేసి అందరి ముఖాల్లో సంతోషంతో వెలిగిపోయేలా చేయమని కోరతానని చెప్పి.. అందరి మనసుల్నిదోచేసింది. గీతతో మాట్లాడితే మరింత బాగా కనెక్టు కావటం ఖాయం కదూ?