Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ .. చాలా టెన్షన్ గా ఉంది: రష్మిక

By:  Tupaki Desk   |   1 April 2021 4:04 AM GMT
కోలీవుడ్ లో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ .. చాలా టెన్షన్ గా ఉంది: రష్మిక
X
తెలుగు తెరపై పూజా హెగ్డే తరువాత ఆ స్థాయి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న కథానాయికగా రష్మిక కనిపిస్తోంది. చాలా తక్కువ సమయంలో రష్మిక స్టార్ డమ్ ను సంపాదించుకుంది. తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ కోసం ఆమె పోటీపడుతోంది. ఇక కోలీవుడ్ లో పాగా వేయడానికిగాను కొంతకాలంగా ఆమె సరైన సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఆ అవకాశం ఆమెకి 'సుల్తాన్' సినిమాతో దక్కింది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా రష్మిక తమిళ తెరకి పరిచయమవుతోంది. ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ వేదికపై రష్మిక మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. మీ అందరినీ కలిసి చాలాకాలమైంది .. మళ్లీ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మాస్కులు పెట్టుకున్నారా? ఏవీ .. నాకైతే కనిపించడం లేదే. సరే .. అందరూ కేర్ ఫుల్ గా ఉండండి .. సినిమా మాత్రం చూడండి. నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు .. కార్తీగారిని ఇక్కడ బాగా చూసుకోండి. తమిళంలో ఇది నా డెబ్యూ ఫిల్మ్ కావడంతో చాలా టెన్షన్ గా ఉంది. ట్రైలర్ .. సాంగ్ చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది. చెప్పండీ ఏదో ఒకటి .. బాగుందా .. హిట్టా? ఓకే .. నాకు చాలా హ్యాపీగా ఉంది.

అంతలో అభిమానులు సూర్య .. సూర్య అని అరిచి గోల చేస్తూ ఉండటంతో, కార్తి .. కార్తి అంటూ రష్మిక కూడా అదే స్టైల్లో అల్లరి చేసింది. ఓకే .. నాకు ఇప్పుడు ఫ్లైట్ ఉంది .. నన్ను మాట్లాడనీయండి అంటూ మొదలుపెట్టింది. అయినా అభిమానులు గోలచేస్తూ ఉండటంతో .. "మాట్లాడకండ్రా .. ఒక్క నిమిషంరా .. ప్లీజ్ రా .." అంటూ రిక్వెస్ట్ చేసింది. "నాకు రేపు షూట్ ఉంది .. కానీ నా సినిమా టీమ్ ని కలవాలని వచ్చేశా అంటూ వంశీ పైడిపల్లి వైపు తిరిగి, నేషనల్ అవార్డును సాధించిన ఆయనకి అభినందనలు తెలియజేస్తూ .. పెద్ద పార్టీ కావాలని అడిగింది. ఆ తరువాత ఆడియన్స్ వైపు తిరిగి, ఏప్రిల్ 2న సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 5వ తేదీన నా బర్త్ డే కూడా ఉంది .. హిట్ అయితే అదే నాకు పెద్ద గిఫ్ట్" అంటూ స్టేజ్ పై ఉన్న కాసేపు సందడి చేసేసింది.