Begin typing your search above and press return to search.
సమంత వార్నింగ్.. రష్మిక రియాక్షన్ తో క్లారిటీ!
By: Tupaki Desk | 24 April 2022 5:05 PM ISTనటి సమంత నిన్నటి రోజున ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘నా మౌనం అజ్ఞానం అని.. నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని.. నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే’ అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది. ఎప్పుడూ కూల్ గా ఉండే సమంత ఒక్కసారిగా ఇలా లేచింది? ఏంటి అంటూ అంతటా చర్చకొచ్చింది.
ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి పెట్టినట్లు? సోషల్ మీడియా జనాల్నా? లేక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మాజీ గురించా? అంటూ కొన్ని రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఈ ట్వీట్ ని నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న లైక్ చేసింది. పవర ఎమోజీతో `పదం` అంటూ తన ట్వీట్ కి రియాక్షన్ ఇచ్చింది. ఇలా సమంతకు మద్దతిచ్చిన ఏకైక మహిళా సెలబ్రిటీల కూడా రష్మిక కావడం విశేషం.
చాలా మంది మహిళలు ఈ ట్వీట్ పై పాజిటివ్ గా స్పందించారు కానీ రష్మిక పవర్ ఎమోజీని జోడించడం చర్చకొస్తుంది. సోషల్ జనాలు రష్మిక గతాన్ని తవ్వడం మొదలు పెట్టారు. రష్మిక మందన్న ని కన్నడ ఇండస్ర్టీకి తీసుకొచ్చి హీరోయిన్ ని చేసింది రక్షిత్ శెట్టి. ఆ తర్వాత అతనితోనే రష్మి క ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఈ విషయంలో రష్మికదే తప్పంతా అని నెటి జనులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెద్ద హీరోయిన్ అయ్యే సరికి రష్మిక కి- రక్షిత్ శెట్టి నచ్చలేదా? అంటూ కామెంట్లు పోస్ట్ చేసారు. భారీ ఎత్తున ట్రోల్ చేసారు. కానీ వీటిని రష్మిక లైట్ తీసుకుంది. అలాగే సమంత కూడా చైతన్యతో విడిపోయిన తర్వాత ఇలాగే విమర్శలకు గురైంది.
ఈ నేపథ్యంలో ట్రోలర్స్ ని ఉద్దేశించే సమంత అలా వార్నింగ్ ఇచ్చిందని..దానికి రష్మిక పవర్ అని రియాక్షన్ ఇచ్చినట్లు గుస గుస వినిపిస్తుంది. కాగా సమంత ట్వీట్ పై ఆమె అభిమానులు మద్దతుగా నిలిచారు. ``మీరు ఏదో ఒక రోజు మాట్లాడాలని కోరుకుంటున్నాం. నిజం చెప్పి అందరి నోళ్లు మూయించాలి. మీరు బలమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ప్రతీ రోజు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని పోస్ట్ పెట్టారు. `వారికి కావాల్సింది మీ దృష్టి మాత్రమే. దయచేసి ఆ ఛాన్స్ ఇవ్వకండి. వారు మీ దృష్టికి అనర్హులు. వాటిని పట్టించుకోకండి అని రాసుకొచ్చారు.