Begin typing your search above and press return to search.
బ్యాడ్ ట్రోల్ కు రష్మిక సూపర్ ఆన్సర్
By: Tupaki Desk | 17 Oct 2021 10:05 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ..తమిళం మరియు కన్నడంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇండియాలో మోస్ట్ బిజీ అండ్ క్రేజీ హీరోయిన్స్ లో ప్రస్తుతం రష్మిక మందన్నా కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అంతటి క్రేజ్ గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు భారీ ఎత్తున అభిమానులను దక్కించుకుంది. అంతటి అభిమానులు ఉన్న రష్మిక మందన్నా ను సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. వాటికి రష్మిక తనదైన శైలిలో సమాధానంను ఇస్తూనే ఉంటుంది. సెలబ్రెటీలు చాలా తక్కువ ట్రోల్స్ కు స్పందిస్తూ ఉంటారు. కొన్ని మనసుకు గాయం చేసినట్లయితే సీరియస్ అవుతారు.. కొన్ని నవ్వు తెప్పిస్తే అందుకు తగ్గట్లుగానే స్పందిస్తారు. రష్మికను ఒక వ్యక్తి ట్విట్టర్ లో బ్యాడ్ ట్రోల్స్ చేసినా కూడా ఆమె ఫేస్ ను షేర్ చేసి మరీ విమర్శించినా కూడా రష్మిక రియాక్షన్ చాలా నార్మల్ గానే ఉంది.
ట్విట్టర్ లో ప్రేమ్ అనే పేరుతో ఉన్న అకౌంట్ లో ఎలా తీసుకుంటారురా దీన్ని అంటూ కామెంట్ పెట్టాడు. రష్మిక ఫొటోను షేర్ చేసిన అతడు ఆమె అందగత్తె కాకున్నా కూడా ఎలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి అన్నట్లుగా ఆ కామెంట్ పెట్టడం జరిగింది. అతడి కామెంట్ కు వేరే హీరోయిన్స్ అయితే పెద్దగా స్పందించే వారు కాదు. వారి అభిమానులు ఆ ట్రోల్స్ కు సమాధానాలు చెప్పే వారు. కాని ఆ వ్యక్తి చేసిన ట్రోల్ కు మాత్రం రష్మిక సమాధానం చెప్పింది. ఎలా అవకాశాలు వస్తున్నాయి అంటూ అతడు సంధించిన ప్రశ్నకు 'నా యాక్టింగ్ కోసం' అంటూ స్మైల్ ఈమోజీలు షేర్ చేసింది. అంతటి సీరియస్ ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానంను అంతా సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఉన్న అలాంటి కొందరు అవివేకులను.. అదే పనిగా ట్రోల్స్ చేసే వారికి ఇలాంటి సమాధానాలతోనే నోరు మూయించాలని.. అప్పుడే ఇతర హీరోయిన్స్ గురించి కూడా కామెంట్స్ చేయడానికి ఇతరులు ఎవరు సాహసించరు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ దృష్టిలో పడటం కోసం కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉండటం చాలా మంది చాలా రకాలుగా ఫొటోలు చేయడం చేస్తూ ఉంటారు. వారి కామెంట్స్ కు సెలబ్రెటీలు ముఖ్యంగా హీరోయిన్స్ రియాక్ట్ అయితేనే ముందు ముందు అలాంటి వారు మరింత మంది పుట్టుకు వచ్చే అవకాశం తగ్గుతుందని నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రష్మిక మందన్నా చేసిన పనిని అభినందిస్తున్నారు.