Begin typing your search above and press return to search.

శ్రీవ‌ల్లి..ర‌ష్మిక మ‌ధ్య తేడానా?

By:  Tupaki Desk   |   15 Nov 2021 7:56 AM GMT
శ్రీవ‌ల్లి..ర‌ష్మిక మ‌ధ్య తేడానా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` రెండు భాగాలు గా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌ష్మిక మంద‌న `శ్రీవ‌ల్లి` అనే గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఆ పాత్ర‌కు సంబంధించిన లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. ఆల్ర్టా డీ గ్లామ్ పాత్ర‌లో ర‌ష్మిక ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శ్రీవ‌ల్లి అంటూ సాగే పాట సోష‌ల్ మీడియాలో ఏ రేంజ్ లో దూసుకు పోయిందో కూడా తెలిసిందే.

శ్రీవ‌ల్లి పాత్ర ఆహార్యం కోసం ర‌ష్మిక ఎక్కువ‌గానే శ్ర‌మించింది. గంట‌ల త‌ర‌బ‌డి మేక‌ప్ ఆర్టిస్టులు ఆమెను సిద్దం చేయ‌డం...షూట్ పూర్త‌యిన త‌ర్వాత మళ్లీ ఆ మేక‌ప్ తొల‌గించుకోవ‌డం కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాల్సి వ‌చ్చింది. తాజాగా రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో త‌న చేతిని ఫోటో తీసి పోస్ట్ చేసింది. మోచేతి నుంచి మ‌ణిక‌ట్టు వ‌ర‌కూ బాగా న‌ల్ల‌గా మేక‌ప్ వేసి ఉంది. ఆపై భాగ‌మంతా అస‌లు రంగు తెలుపు లో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతుంది.

మ‌రి ర‌ష్మిక ఇలా ఎందుకు ఇండికేష‌న్ ఇచ్చిన‌ట్లు? అంటే ఆన్ సెట్స్..ఆఫ్ ది సెట్ మధ్య వ్య‌త్యాసాన్ని ఇలా చెప్ప‌క‌నే చెప్పింది. ర‌ష్మిక కెరీర్ లో ఇదొక ఛాలెంజింగ్ రోల్ గా చెప్పొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ పోషించిన పాత్ర‌లు వేరు..శ్రీవ‌ల్లి పాత్ర వేరు. సినిమా స‌క్సెస్ అయితే గ‌నుక పాన్ ఇండియాలో ర‌ష్మిక క్రేజ్ వెలిగిపోవ‌డం ఖాయం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.