Begin typing your search above and press return to search.

ర‌ష్మిక రిజెక్ట్ చేసిన ఆ బిగ్ స్టార్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   4 Jan 2022 6:30 AM GMT
ర‌ష్మిక రిజెక్ట్ చేసిన ఆ బిగ్ స్టార్ ఎవ‌రు?
X
క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ టాలీవుడ్ లో బిజీ న‌టిగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే `పుష్ప`తో తొలి పాన్ ఇండియా స‌క్సెస్ ని త‌న‌ ఖాతాలో వేసుకుంది. ఇందులో శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక చ‌క్క‌గా న‌టించింది. న‌టిగా సినిమాలో చాలా స్కో ప్ క‌నిపించింది. ఇక పుష్ప రెండ‌వ భాగంలోనూ శ్రీవ‌ల్లి పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. `పుష్ప‌`కి హిందీలోనూ మంచి పేరొచ్చింది.

హిందీలో రిలీజ్ అయిన రెండు..మూడు రోజుల పాటు `పుష్ప` వైపు ప్రేక్ష‌కులు అంత‌గా ఆస‌క్తి చూపించ‌లేదు గానీ త‌ర్వాత మౌత్ టాక్ తో జ‌నాల్ని ర‌ప్పించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. బ‌న్నీ బాలీవుడ్ లో మంచి ఐడెంటిటీని తీసుకొచ్చింది. బ‌న్నీతో పాటు సామీ పాట‌తో ర‌ష్మిక కూడా హిందీ ఆడియెన్ లోకి బాగా దూసుకెళ్లింది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా ఉన్న ఇమేజ్ త‌నకు ఇప్పుడు పెద్ద‌గా క‌లిసొస్తోంది.

అయితే `పుష్ప` స‌క్సెస్ ని ర‌ష్మిక అంత సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు కనిపించ‌లేదు. అలాగే టాలీవుడ్ సినిమాల‌పైనా బ్యూటీ మున‌ప‌టి లా అంత ఆస‌క్తి చూపించ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌లే ఓ బిగ్ స్టార్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ వ‌స్తే సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ర‌ష్మిక ఇంకా టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించాల్సి ఉండ‌గా ఈ ఛాన్స్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది..! అంటే బాలీవుడ్ పై ఉన్న వ్యామోహంతోనేనని గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం హిందీలో `మిష‌న్ మ‌జ్ను`.. `గుడ్ బై` చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవి రెండూ పెద్ద ప్రాజెక్ట్ లే. ఈ సినిమాలు క‌మిట్ అయిన ద‌గ్గ‌ర నుంచి ర‌ష్మిక లో చాలా మార్పులు వచ్చాయ‌ని..తెలుగు సినిమాలు అంటే చిన్న చూపుగా చూస్తుంద‌నే విమ‌ర్శ అప్ప‌ట్లోనే తెర‌పైకి వ‌చ్చింది. ` పుష్ప` రిలీజ్ త‌ర్వాత మ‌రిన్ని మార్పులు వ‌చ్చాయ‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తిచేసి మ‌కాం ముంబైకి మార్చే ఆలోచ‌న‌లో ఉంద‌ని అంటున్నారు.