Begin typing your search above and press return to search.

ర‌ష్మిక మ‌న‌సు నొచ్చుకున్నా ఆనంద‌మే!

By:  Tupaki Desk   |   2 Aug 2022 8:39 AM GMT
ర‌ష్మిక మ‌న‌సు నొచ్చుకున్నా ఆనంద‌మే!
X
నేష‌నల్ క్ర‌ష్ బ్యూటీ రష్మిక మంద‌న్న పై నెట్టింట జ‌రుగుతోన్న ట్రోలింగ్ గురించి..నెగిటివ్ కామెంట్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్ధం క్యాన్సిల్ అయిన ద‌గ్గ‌ర నుంచి ర‌ష్మిక నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బ్రేక‌ప్ కార‌ణంగా ర‌ష్మిక‌నే నెటి జ‌నులు హైలైట్ చేసారు. కెరీర్ కోసం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవ‌డానికి నిరాకరించింద‌ని... అదే స‌మ‌యంలో మ‌రో హీరోతో డేటింగ్ లో ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.

అప్ప‌టి నుంచి మొద‌లైన ప్రచారం నేటికి సాగుతూనే ఉంది. ఇటీవ‌లే ర‌ష్మిక గురించి ఓ తెలుగు న‌టుడు తెగ పొగిడేసాడు. దీంతో ఆ క‌థ‌నాల‌కు మరింత బ‌లం చూకూరిన‌ట్లు అయింది. ప్ర‌స్తుతం బ్యూటీ బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డి క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు మౌల్డ్ అవుతుంది. కాస్ట్యూమ్స్ ఎంపికలో భారీ మార్పులుఏ తీసుకొచ్చింది.

డిజైన‌ర్ దుస్తుల్లో మెర‌వ‌డం..క్లీవేజ్ షో. ..థై షో ఇలా ప్ర‌తీ విషయంలోనూ ర‌ష్మిక నేష‌న‌ల్ బ్యూటీ అనిపించుకోవాల‌నే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో నెట్టింట విమ‌ర్శ‌లు..ట్రోలింగ్ లు ప‌రిపాటే క‌దా. ర‌ష్మిక విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. అయితే ఇలాంటి కొన్ని ప్ర‌శ్న‌లు ర‌ష్మిక ముందుకెళ్తే ప‌రిణితి చెందిన వ్యాఖ్య‌ల‌తో హుందాతనాన్ని ప్ర‌ద‌ర్శించింది.

``సినిమా నాకు చాలానే ఇచ్చింది. పేరు గుర్తింపుతో పాటు ప్రేక్ష‌కుల్లో ప్రేమ‌. ఇవ‌న్నీ ఎంతో అదృష్టం ఉంటే త‌ప్ప రావు. అందం..అభిన‌యంలో న‌న్ను మించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నాకే అవ‌కాశం వ‌చ్చిందంటే నేను ప్ర‌త్యేక‌మ‌నే క‌దా? అందుకే మిగ‌తా స‌మ‌స్య‌ల్ని చాలా చిన్న‌విగా భావిస్తాను. పుకార్ల గురించి ఎప్పుడూ ఆలోచించను.

ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డానికి ముఖానికి రంగు వేసుకుంటున్నాను. అదే రంగు నాకు ఇన్ని ర‌కాల గుర్తింపుల్ని తెచ్చి పెట్టింది. నా గురించి వినిపించే చిన్న చిన్న విష‌యాలు కూడా వాళ్ల‌కి ఆనందాన్ని క‌ల్గిస్తాయంటే? అంత‌కంటే కావాల్సింది ఏముంటుంది.

నేను ఏంటో నాగురించి నాకు తెలుసు. నాకుటుంబానికి తెలుసు. అలాంటప్పుడు మిగ‌తా వాటి గురించి అన‌వ‌స‌రంగా ఆలోచించి స‌మ‌యాన్ని వృద్ధా చేసుకోను. ఉన్న చిన్న జీవితంలో సంతోషంగా ఉండాలి. న‌లుగుర్ని సంతోష పెట్టాల‌న్నదే నాకు తెలుసు`` అంటూ చెప్పుకొచ్చింది.