Begin typing your search above and press return to search.

అయ్యో ‘పుష్ప’లో రష్మిక సెకండ్‌ హీరోయినా?

By:  Tupaki Desk   |   24 April 2020 12:00 PM IST
అయ్యో ‘పుష్ప’లో రష్మిక సెకండ్‌ హీరోయినా?
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్‌ గా రష్మిక మందన్న ఇప్పటికే ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం రష్మిక చిత్తూరు యాసను నేర్చుకుంటుందని.. మాస్‌ లుక్‌ లో గిరిజన బాలిక లుక్‌ లో రష్మిక కనిపించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పుష్పలో అల్లు అర్జున్‌ ఇంకా బన్నీల మద్య ఎలాంటి రొమాంటిక్‌ ట్రాక్‌ ఉండదట. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసం బన్నీకి జోడీగా మరో హీరోయిన్‌ ను సుకుమార్‌ ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. రష్మిక పాత్రకు కథలో చాలా ప్రాముఖ్యత ఉన్నా కూడా బన్నీకి జోడీగా ఇద్దరి మద్య రొమాంటిక్‌ సీన్స్‌ ఉండవనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్ర కోసం నివేధా థామస్‌ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వరుసగా చిత్రాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఇలా మరో హీరోయిన్‌ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాల్సి రావడం పాపం అంటున్నారు. బన్నీతో రొమాంటిక్‌ సీన్స్‌ లేకుండా కూడా పుష్ప చిత్రం రష్మికకు తప్పకుండా మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం మాత్రం యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే సినిమాను కేరళలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సమయంలో సినిమాలో మెయిన్‌ విలన్‌ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.