Begin typing your search above and press return to search.

సుకుమార్‌ కు నిర్మొహమాటంగా నో చెప్పిన రష్మిక

By:  Tupaki Desk   |   17 Jun 2020 7:10 AM GMT
సుకుమార్‌ కు నిర్మొహమాటంగా నో చెప్పిన రష్మిక
X
షూటింగ్స్‌ కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సినిమాల షూట్స్‌ కు కొందరు రెడీ అవుతున్నారు. ఇప్పటికి ఇప్పుడు కాకున్నా కూడా వచ్చే నెల నుండి అయినా షూటింగ్‌ కు వెళ్లాలని కొందరు భావిస్తున్నారు. పుష్ప చిత్రంకు సంబంధించిన చిత్రీకరణకు దర్శకుడు సుకుమార్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. రంగస్థలం తర్వాత అనుకోని కారణాల వల్ల చాలా గ్యాప్‌ వచ్చింది. సుకుమార్‌ ఇప్పటికే చాలా నష్టపోయాడు. అందుకే వెంటనే షూటింగ్‌ చేయాలని ఆరాటపడుతున్నాడట. వచ్చే నెల నుండి లేదంటే ఆగస్టు నుండైనా సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టేందుకు సుకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అల్లు అర్జున్‌ కూడా సుకుమార్‌ ఎప్పటి నుండి షూట్‌ కు రమ్మంటే అప్పుడే వచ్చేందుకు రెడీగా ఉన్నాడట. కాని హీరోయిన్‌ రష్మిక మాత్రం ఇప్పట్లో షూటింగ్‌ కు హాజరు అయ్యేది లేదని చెప్పిందట. రాబోయే మూడు నెలల వరకు షూటింగ్స్‌ కు హాజరు కాలేనని పేర్కొందట. మూడు నెలల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ అప్పుడు నిర్ణయం తీసుకుంటానంటోంది. అంటే రష్మిక సెప్టెంబర్‌ వరకు షూటింగ్‌ కు రానట్లే అంటున్నారు.

సెప్టెంబర్‌ లో కూడా కేసులు ఇలాగే ఉంటే మళ్లీ కొంత కాలం కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలనుకుంటుంది. షూటింగ్‌ విషయమై సుకుమార్‌ సంప్రదించగా నిర్మొహమాటంగా ప్రస్తుతానికి తాను షూటింగ్‌ కు హాజరు కాలేనని చెప్పిందట. అయితే పుష్ప చిత్రంలోని పాత్ర కోసం రష్మిక చిత్తూరు యాస నేర్చుకోవడంతో పాటు పల్లెటూరు అమ్మాయిలా బాడీ లాంగ్వేజ్‌ ను కూడా ప్రాక్టీస్‌ చేస్తుందట. మరి షూటింగ్‌ లో రష్మిక ఎప్పుడు జాయిన్‌ అవ్వబోతుందో చూడాలి.