Begin typing your search above and press return to search.

ఒకే హీరోయిన్ ఉంటుంది.. తేల్చిన పుష్ప యూనిట్

By:  Tupaki Desk   |   28 April 2020 1:39 PM IST
ఒకే హీరోయిన్ ఉంటుంది.. తేల్చిన పుష్ప యూనిట్
X
ఈ ఏడాది 'అల వైకుంఠపురంలో' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత స్టైలిష్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప మీద ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్ట పడుతున్నారట.

వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. దాదాపు 60 శాతం సినిమా షూటింగ్ అడవుల్లోనే నిర్వహించనున్నారు. మరోసారి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ తో సుకుమార్ ఈ సినిమాని తీర్చిదిద్దాలని ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు రంగస్థలం సినిమాతో రాంచరణ్ సమంత లకి ఎంతటి క్రేజ్ వచ్చిందో అంతటి క్రేజ్ అల్లు అర్జున్, రష్మిక మందనలకి తీసుకు వచ్చేందుకు పకడ్బందీగా పాత్రలను రాసుకున్నారట. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని.. బన్నీకి ప్రియురాలిగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

వారిలో ఒక హీరోయిన్ గా నివేదా థామస్ అని, పూజా హెగ్డే.. ఇలా రక రకాల పేర్లు తెరమీదకొచ్చాయి. కాని తాజాగా ఈ విషయంలో క్లారిటి ఇచ్చారట చిత్రయూనిట్. ఇందులో ఒక్క రష్మిక మందన తప్ప మరో హీరోయిన్ కి స్థానం లేదని తేల్చిచెప్పేసారు. ఇక ఈ సినిమాని లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇంతవరకు సుకుమార్ ఏ సినిమాలో కూడా రెండో హీరోయిన్ కి ఛాన్స్ లేదు. ఈ సినిమాలో కూడా ఒకే హీరోయిన్ ఉందని చెప్పడం తో సుకుమార్ తన పంథా మార్చ లేదని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.