Begin typing your search above and press return to search.

లావణ్య గీత దాటితే.. రష్మిక దిగింది

By:  Tupaki Desk   |   6 Sep 2017 11:12 AM GMT
లావణ్య గీత దాటితే.. రష్మిక దిగింది
X
ప్రస్తుత రోజుల్లో కమర్షియల్ ఫార్ములాను నమ్ముకునే టాప్ హీరోల కన్నా ప్రయోగాత్మకమైన చిత్రాలకు రెడీ అనే కుర్ర హీరోలనే ఎంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కుర్ర హీరోలు కూడా స్టార్ హోదా ఉన్నపుడే పెద్ద ప్రముఖ దర్శక నిర్మాతలతో పని చెయ్యాలని అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోవడం లేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం అర్జున్ రెడ్డి - విజయ్ దేవరకొండ వైపే చూడటంతో అతను తీయబోయే నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే రీసెంట్ గా ఈ హీరో గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వం వహించే ఓ చిత్రంలో ఛాన్స్ కొట్టేశాడు. "శ్రీరస్తు శుభమస్తు" సినిమా తర్వాత పరశురామ్ నిర్మాత అల్లు అరవింద్ కి కథ చెప్పగానే హీరోగా ఎవరిని పెడదామా అని ఆలోచించుకుంటున్న సమయంలో అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ వచ్చి ఆకర్షించడంతో అతన్ని పట్టేసుకున్నారు ఈ దర్శకనిర్మాతలు. ఆ తరువాత లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కాని సడన్ గా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాను అని ప్రకటించేసింది లావణ్య. మెగా క్యాంపులో మెగా ఛాన్సులు కొట్టేస్తోంది అనుకున్న తరుణంలో అమ్మడు ఇలా చేయడం అందరికీ షాకింగ్ గానే ఉంది.

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన కన్నడ భామ రష్మిక మందనను సెలెక్ట్ చేశారట. చూడగానే తన నవ్వుతే చూపరులను అక్కట్టుకునే ఈ భామ మొదటి సినిమాతోనే కన్నడలో బిగ్గెస్ట్ సెలబ్రెటీ అయిపొయింది. కన్నడ లో కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో నిఖిల్ రీమేక్ చేస్తున్నాడు. అప్పట్లో ఈ భామ ప్రభాస్ - రామ్ సినిమాల్లో ఛాన్సును కూడా కొట్టేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా విజయ్ దేవరకొండ సినిమాలో గీతా ఆర్ట్స్ క్యాంపులో ఛాన్సు కొట్టేసింది. అది సంగతి.