Begin typing your search above and press return to search.

ర‌ష్మిక రిజెక్టెడ్ స్ర్కిప్స్ట్ ఇవే..రీజ‌న్స్ ఇంట్రెస్టింగ్!

By:  Tupaki Desk   |   10 April 2022 12:30 AM GMT
ర‌ష్మిక రిజెక్టెడ్ స్ర్కిప్స్ట్ ఇవే..రీజ‌న్స్ ఇంట్రెస్టింగ్!
X
ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ర‌ష్మిక‌లో బ్యూటీ యాంగిల్ తో పాటు...త‌న‌లో చ‌లాకీత‌నం...స‌క్సెస్ లు అందుకు కీల‌క పాత్ర పోషించాయి. అయితే అమ్మ‌డు స్ర్కిప్ట్ లు ఎంపిక చేసే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కొన్ని సినిమాలు డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌...మ‌రికొన్ని స్ర్కిప్ట్ ల‌పై న‌మ్మ‌కంలేక ర‌ష్మిక వ‌చ్చిన అవ‌కాశాల్ని కాల‌ద‌న్నింది. అలా ఇప్ప‌టివ‌ర‌కూ 50 స్ర్కిప్ట్ ల‌వర‌కూ రిజెక్ట్ చేసిందిట‌. వాటిలో టాప్ 10 చిత్రాల గురించి ఓ లుక్ ఏద్దాం.

క‌న్న‌డ‌లో హిట్ అయిన 'కిరిక్ పార్టీ' హిందీలో కార్తీన్ ఆర్య‌న్ హీరోగా తెర‌కెక్కింది. ఇందులో హీరోయిన్ గా మాతృకలో న‌టించిన ర‌ష్మిక మంద‌న్న‌నే సంప్ర‌దించారుట. కానీ రీమేక్ లో న‌టించ‌న‌ని తెగేసి చెప్పేసిందిట‌. అలాగే బాలీవుడ్ లో రీమేక్ అయిన 'జెర్సీ'లో హీరోయిన్ ఆఫ‌ర్ ముందుగా ర‌ష్మిక‌కే వ‌చ్చింద‌ట‌. కానీ రొమాంటిక్ స‌న్నివేశాలు హ‌ద్దు మీర‌డంతో ఛాన్స్ రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఇక మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ఆచార్య‌'లో చర‌ణ్ ల‌కి ఫెల‌యిర్ గా న‌టించే ఛాన్స్ ర‌ష్మిక‌కే వ‌చ్చిందిట‌. కానీ డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో ఛాన్స్ మిస్ చేసుకుంద‌ని స‌మాచారం. అలాగే కోలీవుడ్ హీరో విజ‌య్ క‌థాన‌య‌కుడిగా తెర‌కెక్కిన 'మాస్ట‌ర్' చిత్రంలోనూ తొలుత హీర‌యిన్ గా ర‌ష్మిక‌నే అనుకున్నా రుట‌. కానీ అందులో హీరోయిన్ పాత్ర‌కు అంత స్కోప్ లేద‌ని తిర‌స్క‌రించింద‌ట‌.

అలాగే మ‌రోసారి విజ‌య్ స‌ర‌స‌న 'బీస్ట్' లో న‌టించే ఛాన్స్ త‌న‌కే ముందు వ‌చ్చిందిట‌. కానీ అనివార్య కార‌ణాల వల్ల న‌టించ లేక‌పోయిందిట‌. ఈ రెండు అవ‌కాశాలు కోల్పోవ‌డం ప‌ట్ల‌ ర‌ష్మిక ఇప్ప‌టికీ చాలా ఫీల‌వుతుందిట‌. అందుకే విజ‌య్ కోసం 'బీస్ట్' ప్ర‌మోష‌న్ లోనూ పాల్గొని కొంత వ‌ర‌కూ ఆ బాధ‌ను తొల‌గించుకుంటుంద‌ని అంటున్నారు. ఇక నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'అంటే సుంద‌రానికి' చిత్రంలో నాయిక ఛాన్స్ ర‌ష్మిక దే అంట‌.

కానీ ర‌ష్మికకి పాత్ర‌ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఒప్పుకోలేదుట‌. అందుకే న‌జ్రియా న‌జీమ్ ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 'బంగార్రాజు' లో నాగ‌చైత‌న్య‌కి జోడీగా మేక‌ర్స్ ర‌ష్మిక‌నే తీసుకోవాల‌నుకున్నారుట‌. కానీ ఆమె రిజెక్ట్ చేయ‌డంతో చివ‌రి నిమిషంలో కృతి శెట్టిని తీసుకున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. అలాగే ఆర్ సీ 15వ సినిమాలో ర‌ష్మిక పేరు ప్ర‌పోజ‌ల్ కి వ‌చ్చిందిట‌. కానీ ఆమె బిజీ షెడ్యూల్ చూసి మేక‌ర్స్ వెన‌క్కి తగ్గి కియారా అద్వాణీని లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అలాగే యంగ్ మేక‌ర్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన 'మ‌హాస‌ముద్రం'లో సిద్ధార్ద్ కి జోడీగా న‌టించ‌మ‌ని ర‌ష్మిక‌ని అడిగారుట‌. కానీ ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర లో ఇంటిమేట్ సీన్స్ హ‌ద్దు మీరి ఉండ‌టంతో న‌టించ‌న‌నిల ముఖం మీద‌నే చెప్పేసిందిట‌. ఇంకా కొంత మంది అగ్ర హీరోల‌ ప్రాజెక్ట్ ల‌కు ర‌ష్మిక నో చెప్పిందిట‌. అందుకు చాలా కార‌ణాలే ఉన్నాయ‌ని స‌మాచారం.