Begin typing your search above and press return to search.

సామీ సామీ అంటే బ‌న్నీ అలా చేశాడా?

By:  Tupaki Desk   |   15 Dec 2021 7:00 PM IST
సామీ సామీ అంటే బ‌న్నీ అలా చేశాడా?
X
టాలీవుడ్ లో అంకిత‌భావం క‌లిగిన ఉత్త‌మ న‌టుడు ఎవ‌రో ఇంత‌కుముందు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి చెప్పారు. బ‌న్ని ది బెస్ట్ అంటూ కితాబిచ్చేశారు. హార్డ్ వ‌ర్క్ డెడికేష‌న్ డౌన్ టు ఎర్త్ ఇలా అన్నిటికీ బ‌న్నీయే కేరాఫ్ అడ్రెస్. ఇప్పుడు అతడి అంకిత‌భావానికి ర‌ష్మిక కూడా ఫుల్ మార్కులేసింది. అత‌డితో క‌లిసి ప‌ని చేయ‌డం గొప్ప అనుభ‌వం అని ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపింది.

అంతేకాదు తన పాట సామీ సామీలో స్టెప్పుల కంపోజింగ్ స‌హా ప్ర‌తిదానిని బ‌న్ని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాడ‌ని తెలిపింది ర‌ష్మిక‌. అందుకే అంత గ‌మ్మ‌త్తుగా ఆ పాట కుదిరింద‌ని వెల్ల‌డించింది.

మానిట‌ర్ నుంచి అత‌డు ప్ర‌తిదీ మానిట‌ర్ చేశాడ‌ట‌. సామి సామి పాటను చిత్రీకరించడం చాలా కష్టమైంద‌ని.. మారుమూల ప్రాంతంలో చిత్రీకరించార‌ని..వెల్ల‌డించింది. మేము దానిపై చాలా కష్టపడ్డాము. అది పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ప్రతి షాట్ ను పర్యవేక్షించేవార‌ని తెలిపింది. పుష్ప‌కి సంబంధించిన పాటలు ట్రైలర్ లు పోస్టర్ లకు మంచి ఆదరణ లభించింది అని తెలిపారు.

మ‌రో రెండు రోజుల్లో పుష్ప థియేట‌ర్ల‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తాజా చాటింగ్ లో తాను పనిచేసిన అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో సుకుమార్ ఒకరని ర‌ష్మిక వెల్ల‌డించింది.

ఇది ఒక పూర్తి గ్రామీణ చిత్రం. బ‌న్ని- సుకుమార్ జోడీతో నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను అని ర‌ష్మిక‌ చెప్పింది. ఈ సినిమా కోసం తనను ఎలా ఎంపిక చేసుకున్నారు? అనే దాని గురించి చెబుతూ.. పుష్ప నిర్మాతలు చిత్తూరు యాసతో పరిచయం ఉన్న నటి కావాలని కోరుకున్నారు. ఒప్పందానికి ముందే నేను మూడు లుక్ టెస్ట్ లు ఇచ్చాను అని తెలిపింది.

దర్శకుడు సుకుమార్ దీనికి ఆర్గానిక్ (ఆట‌విక జాతి) అప్పీల్ తీసుకురావాలని య‌త్నించారు. అందుకే ఈ పాత్ర కోసం చాలా విషయాలు నేర్చుకోవలసి వ‌చ్చింద‌ని తెలిపింది.

అలాగే ముందే డైలాగ్ లను నేర్చుకోలేదు. ఎందుకంటే మేము ప్రిపేర్ కాకుండా వెళ్ళవలసి వచ్చింది. సుక్కు సర్ దర్శకత్వంలో అతను ప్రతిదీ లైవ్ లీగా చేయాల‌ని కోరుకున్నారు. సెట్స్ లోనే మాకు మా డైలాగ్స్ ఇచ్చారు. మేము సన్నివేశాన్ని ఎంచుకుని న‌టించేశామ‌ని తెలిపారు.