Begin typing your search above and press return to search.

వీడియో: ర‌ష్మిక జిగ్ జాగ్ గేమ్ ఎంత బాగుందో

By:  Tupaki Desk   |   4 Oct 2020 4:30 AM GMT
వీడియో: ర‌ష్మిక జిగ్ జాగ్ గేమ్ ఎంత బాగుందో
X
అన్ లాక్ 5.0 అమ‌ల్లోకి రావ‌డంతో షూటింగుల‌కు వెసులుబాటు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో థియేట‌ర్ల‌ను తెరిచేందుకు అనుమ‌తులు వ‌చ్చేస్తున్నాయ‌న్న ప్ర‌చారం సాగిపోయింది. ఆ క్ర‌మంలోనే స్టార్లు ఒక్కొక్క‌రుగా సెట్స్ పైకి వెళ్లి షూటింగులు చేస్తున్నారు. ఇక ర‌ష్మిక మంద‌న టైమ్ వ‌చ్చేసింది.

సెట్స్ కి వెళ్లి కుస్తీలు ప‌ట్టాల్సిన టైమ్ రానే వ‌చ్చేసింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ మూవీ `పుష్ప‌` సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఈ లాక్ డౌన్ సీజ‌న్ లో ర‌ష్మిక ఏం చేసింది? అంటే ఇదిగో ఈ వీడియో సెట‌ప్ చూస్తే మీకే అర్థ‌మైపోతుంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో అందాల‌ రష్మిక మంద‌న‌ తన వర్కౌట్ వీడియోని షేర్ చేసింది. ర‌ష్మిక తాడు ఆట‌ను ఎంత అందంగా ఆడుతుందో.. ఎలా సరదాగా ఆడేస్తోందో క‌నిపిస్తోంది క‌దూ! ప్రత్యేకించి చెమటలు పట్టేసేంత‌గా స్కిప్పింగ్ ని ఆస్వాధిస్తోంది. ర‌ష్మిక షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక ఈ తాడాట‌లో కుర్ర‌బ్యూటీ జిగ్ జాగ్ న‌మూనాలో అటూ ఇటూ గెంతుతూ చేస్తున్న విన్యాసాలు క‌డుపుబ్బా న‌వ్వించేయ‌డం ఖాయం.

``మీరు ఒంటరిగా వర్కౌట్ చేసేప్పుడు ఇదిగో ఇలా మీ కోసం సరదాగా ప్లాన్ చేసుకోవాలి`` అని రష్మిక తనదైన శైలిలో కొంటె వ్యాఖ్య‌ను జోడించింది. గత కొన్ని రోజులుగా.. రష్మిక సూపర్ కూల్ బీచ్ వర్కౌట్ వీడియోలు ఫోటోలను పోస్ట్ చేస్తోంది. కానీ తాజా వీడియోలో రష్మిక ట్రేడ్ మార్క్ చిలిపిత‌నం మైమ‌రిపించేస్తోందిలా.