Begin typing your search above and press return to search.

కోటి మందిని వెనకేసుకున్న కామ్రేడ్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   18 Oct 2020 2:30 AM GMT
కోటి మందిని వెనకేసుకున్న కామ్రేడ్‌ బ్యూటీ
X
ఈమద్య కాలంలో సెలబ్రెటీలు ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఎక్కువగా ఉంటున్నారు. వారి స్టార్‌ డంకు ఇన్‌ స్టా గ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య కొలమానం అవుతుంది. అభిమానులు తమ స్టార్‌ ఫాలోవర్స్‌ ఇంత అంటే తమ స్టార్‌ ఫాలోవర్స్‌ ఇంత మంది అంటూ చంకలు గుద్దుకుంటున్నారు. ఇలాంటి సమయంలో హీరోయిన్స్‌ ఇన్‌ స్టా ఫాలోవర్స్‌ సంఖ్యలో హీరోలను ఈజీగా క్రాస్‌ చేసి వెళ్లి పోతున్నారు. హీరోల కంటే హీరోయిన్‌ ఫొటో షూట్‌ లు మరియు ఫన్నీ వీడియోల కోసం వారిని అనుసరించేందుకు ఇన్‌ స్టా యూజర్స్‌ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఛలో.. గీత గోవిందం సినిమాలతో సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయి పుష్పతో పాన్‌ ఇండియా క్రేజ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఇన్‌ స్టాలో అరుదైన మైలురాయిని చేరుకుంది. అతి తక్కువ మంది హీరోయిన్స్‌ మాత్రమే దక్కించుకున్న కోటి మంది ఫాలోవర్స్‌ సంఖ్యను ఈమె దక్కించుకుంది. సౌత్‌ లో హీరోయిన్స్‌ గా చాలా కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన వారు 10 మిలియన్‌ ల మార్క్‌ ను క్రాస్‌ చేశారు. కాని రష్మిక మాత్రం చాలా తక్కువ సమయంలోనే ఇన్‌ స్టాలో పది మిలియన్‌ ల మందిని వెనకేసుకోవడం ఆశ్చర్యం.

రష్మిక ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళం మరియు కన్నడంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. అందుకే అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను అభిమానిస్తున్నారు. అందుకే ఆమెకు ఈ స్థాయి ఫాలోవర్స్‌ దక్కారు. పుష్ప సక్సెస్‌ అయ్యి బాలీవుడ్‌ లో కూడా ఈమెకు పేరు వస్తే వచ్చే ఏడాదిలో రెండు కోట్లకు కూడా ఈమె చేరే అవకాశం ఉందని సోషల్‌ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోటి మంది ఫాలోవర్స్‌ అయిన సందర్బంగా ప్రత్యేకంగా వీడియోను మరియు ఒక ఫొటోను షేర్‌ చేసింది. పది మిలియన్‌ లు అయిన సందర్బంగా కేక్‌ కట్‌ చేస్తున్నట్లుగా కూడా రష్మిక ఫొటో పెట్టింది. తన ఫ్యామిలీ ఇంత పెద్దది అయినందుకు సంతోషంగా ఉందని కూడా ఇన్ స్టాలో షేర్‌ చేసింది.