Begin typing your search above and press return to search.

పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక

By:  Tupaki Desk   |   6 Feb 2023 4:15 PM GMT
పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక
X
నేషనల్ క్రష్ రష్మిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరాక్ పార్టీ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ తెలుగులో ఛలో సినిమాతో వచ్చింది. గీతా గోవిందం సినిమాతో కుర్రకారు గుండెల్లో మేడమ్ గా స్థిర పడిపోయిన ఈ ముద్దుగుమ్మ.. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.

తాజాగా పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించి అందరినీ మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అయితే ఆ క్యూట్ బ్యూటీ తాజాగా పెళ్లిపై కొన్ని కామెంట్లు చేసింది. అవెంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తనకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని పేర్కొంది. కానీ ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే మాత్రం తనకు అతడి వద్ద చాలా కంఫర్ట్ గా ఫీలయ్యేలా ఉండాలని చెప్పింది. అలాంటి వ్యక్తినే తాను పెళ్లి చేసుకుంటానని వివరించింది. 1996 ఏప్రిల్ 5వ తేదీన పుట్టిన ఈ బ్యూటీ కేవలం 26 ఏళ్ల వయసులోనే ఉంది. అయినా ఇప్పుడు ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా నటించబోతోంది.

అయితే తన మొదటి సినిమా కిరాక్ పార్టీలో నటిస్తున్నప్పుడు సహచర నటుడు రక్షిత్ శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే 2017లో వారి నిశ్చితార్థం కూడా జరిగింది.

కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల వారు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈమె తెలుగు ఇండస్ట్రీలోని అడుగు పెట్టిన తర్వాత హీరో విజయ్ దేవర కొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో అతడితో నటించడం.. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అవడంతో అంతా వీరిద్దరి మధ్యా ఏదో ఉందనుకున్నారు. తమ మధ్య ఏం లేదని వారిద్దరూ చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ.. ఎప్పుడూ వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ వేడుకల కోసం ఆమె విజయ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లగా మరోసారి వీరిపై పుకార్లు వచ్చాయి. కానీ ఈ సారి రష్మిక మాత్రం గట్టిగానే తమ మధ్య ఏం లేదని.. కేవలం స్నేహం మాత్రమే ఉందని తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.