Begin typing your search above and press return to search.

మరో జాక్ పాట్ దగ్గరలో శ్రీవల్లి

By:  Tupaki Desk   |   3 Oct 2022 8:52 AM GMT
మరో జాక్ పాట్ దగ్గరలో శ్రీవల్లి
X
నేషనల్ ఫ్రెష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన పుష్ప సినిమాతో ఇప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది అనే చెప్పాలి. అందులో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించి బాలీవుడ్ జనాలను కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ అగ్రదర్శక నిర్మాతల నుంచి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది.

ఇక త్వరలోనే మరొక జాబ్ పాట్ లాంటి ఆఫర్ అందుకోబోతున్నట్లు ఒక కొత్త టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవైపు తెలుగు తమిళంలో వరుస విజయాలు అందుకుంటున్న రష్మిక మందన ఇటీవల సీతారామం సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని అందుకుంది. ఆ సినిమా హిందీలో కూడా మంచి ప్రాఫిట్స్ అయితే అందించింది.

ఇక ఇప్పుడు రష్మిక ఫోకస్ ఎక్కువగా హిందీ పై పెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఇదివరకే ఆమె మిషన్ మజ్ను అనే ఒక సినిమా చేసింది. ఇక అమితాబచ్చన్ తో కూడా గుడ్ బై అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలతో పాటు ఆమెకు కొంతమంది అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం వస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఎప్పటినుంచో చర్చలో దశలో ఉన్న ఆషీకీ 3 సినిమాలో కూడా ఈ బ్యూటీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. 1990లో వచ్చిన ఆషీకీ సినిమాకు మళ్ళీ చాలాకాలం తర్వాత ఫ్రాంఛైజ్ గా మరో ప్రేమ కథను తెరకెక్కించారు. ఆషీకీ 2లో ఆదిత్య రాయి కపూర్ శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో సక్సెస్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ఆషీకీ 3 సినిమాను కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు హీరోగా ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఇక హీరోయిన్ కోసం ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

దర్శకుడు అనురాగ్ బసు ఇద్దరు ముగ్గురు హీరోయిన్ లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. ఇక లిస్టులో అయితే రష్మిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇటీవల కాలంలో వరుస విజయాలనుకుంటున్న రష్మిక నిజంగానే ఈ బంపర్ ఛాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.