Begin typing your search above and press return to search.

వీడియో: శ్రీ‌వ‌ల్లీ శ్రీ‌వ‌ల్లీ అంటూ తెగ సంపుతున్నారుగా

By:  Tupaki Desk   |   16 July 2022 5:24 AM GMT
వీడియో: శ్రీ‌వ‌ల్లీ శ్రీ‌వ‌ల్లీ అంటూ తెగ సంపుతున్నారుగా
X
ముంబై సినీప‌రిశ్ర‌మ‌లో ఒక సౌత్ న‌టికి ఇలాంటి ఘ‌న‌స్వాగ‌తం నిజంగా చాలా అరుదు. త‌న పాత్ర పేరు పెట్టి పిలవడం అన్న‌ది ఈరోజుల‌లో చాలా అరుదు. శ్రీ‌దేవి జ‌య‌ప్ర‌ద కాలంలో అలా ఉండేది. చాలా కాలానికి గ‌జినీ రీమేక్ తో అశిన్ అంత‌గా ప్ర‌భావం చూపింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ ద‌క్షిణాది న‌టీమ‌ణుల‌కు అంత సీన్ క‌నిపించ‌లేదు కానీ ఇటీవ‌లి కాలంలో అంత‌గా ప్ర‌భావం చూపించిన న‌టి ర‌ష్మిక మంద‌న‌.

పుష్ప‌రాజ్ గాళ్ ఫ్రెండ్ శ్రీ‌వ‌ల్లి పాత్రలో అద్భుతంగా న‌టించిన ర‌ష్మిక‌కు ఈ పాత్ర అమాంతం ఫాలోయింగ్ పెంచింది. ముఖ్యంగా ఉత్త‌రాదిన‌ చాలా పేరు తేవ‌డ‌మే కాదు.. చిక్కులు తెచ్చిపెట్టిన‌ట్టుగానే కనిపిస్తోంది. దానికి తాజా ప్రూఫ్ ఇది.

ఉత్త‌రాది ఆడియెన్ తో పాటు ముంబై ప‌రిశ్ర‌మ శ్రీ‌వల్లిని ఎంత‌గా ప్రేమిస్తోందో తెలిపే వీడియోలు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. శ్రీ‌వ‌ల్లిని ముంబై మీడియా ప్ర‌తినిధులు కూడా ఎంత‌గానో ఆరాధిస్తున్న వైనం క‌నిపించింది. ర‌ష్మిక ముంబైలో అలా ఓ వేడుక‌కు విచ్చేసిందో లేదో శ్రీ‌వ‌ల్లీ శ్రీ‌వ‌ల్లీ అంటూ ముంబై మీడియా వెంట‌ప‌డింది. త‌న‌ని ఎంతో ప్రేమ‌గా శ్రీ‌వ‌ల్లీ శ్రీ‌వ‌ల్లీ అంటూ మీడియా పిలిచింది. ఇక ర‌ష్మిక అలా రెడ్ హాట్ ఫ్రాకులో హొయ‌లు పోతూ ఫోజులతో మీడియాకు అంతే స‌న్నిహితంగా మెలిగింది.

ర‌ష్మిక మంద‌న‌ తాజా వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారాయి. వీటిలో ర‌ష్మిక రెడ్ హాట్ లుక్ లో వేడెక్కించింది. నిజానికి ఈ ఔట్ ఫిట్ త‌న‌కు ఏమాత్రం సౌక‌ర్యంగా క‌నిపించ‌లేదు. ఓవైపు కెమెరాల‌కు ఫోజులిస్తున్న ర‌ష్మిక ఆ డిజైన‌ర్ ఫ్రాక్ స‌రిగా కుద‌ర‌క‌పోవ‌డంతో చాలా ఇబ్బంది ప‌డింద‌ని తెలిసిపోతోంది.

త‌న‌పై వ‌రుస క్లిక్ ల‌తో కెమెరా ఫ్లాష్ లు మెరుస్తున్నా.. థై అందాల ఎలివేష‌న్ కోసం క్లీవేజ్ షో కోసం ప్ర‌త్యేక అలంక‌ర‌ణ ఏమాత్రం సౌక‌ర్యంగా లేదు. ఇక నియాన్ కాంతుల వెలుగుల్లో బాలీవుడ్ భామ‌ల్లా ప్లాస్టిక్ న‌వ్వులు కురిపించ‌డంలోనూ బోలెడంత ఇబ్బంది ప‌డుతూ క‌నిపించింది. పాపం ర‌ష్మిక పాట్లు చూడ‌త‌ర‌మా! అన్నంత‌గా ఉంది ఆ స‌న్నివేశం నిశితంగా ప‌రిశీలిస్తే..!

మైక్ లెస్ జాక్స‌న్ అంటూ ఒక అభిమాని దీనిపై కామెంట్ చేయ‌గా.. ప్ర‌తిసారీ అదే ఫోజ్ రిపీట‌వుతోంది.. ఇక మార్చండి! అంటూ వేరొక అభిమాని ర‌ష్మిక వీడియో చూసాక స్పందించాడు. సౌత్ నుంచి అందాల రాణి అంటూ ప‌లువురు యువ‌త‌రం కాంప్లిమెంట్లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం ర‌ష్మిక న‌టించిన‌ హిందీ సినిమాల ప్ర‌చారం జోరు పెరిగింది. ఈ ప్ర‌మోష‌న్స్ లోనే శ్రీ‌వ‌ల్లికి ఉన్న అసాధార‌ణ‌ ఫాలోయింగ్ బ‌య‌ట‌ప‌డుతోంది.