Begin typing your search above and press return to search.

వీడియో : బీచ్‌ లో ముద్దుగుమ్మ కష్టం

By:  Tupaki Desk   |   30 Sept 2020 5:00 PM IST
వీడియో : బీచ్‌ లో ముద్దుగుమ్మ కష్టం
X
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ మరియు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ అమ్మడు ప్రేక్షకులకు రీచ్‌ అవ్వబోతుంది. కనుక ఫిజిక్‌ విషయంలో రష్మిక ఏమాత్రం అశ్రద్దగా ఉండకూడదు. ఈ సమయంలో ఫిజిక్‌ లో మార్పు వస్తే సినిమా ఆఫర్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఆఫర్లు లేని హీరోయిన్స్‌ గంటల తరబడి వర్కౌట్స్‌ చేస్తూ ఉంటారు. అలాంటిది రష్మిక ఎంతగా కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రష్మిక ఆహార నియమాలు పాటించడంతో పాటు రెగ్యులర్‌ ఈమె ఉదయాన్నే బీచ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం బీచ్‌ వీడియోను షేర్‌ చేసిన రష్మిక తాజాగా మరో బీచ్‌ వర్కౌట్‌ వీడియోను షేర్‌ చేసింది. తాజా వీడియోలో రష్మిక చేతిలో చాలా బరువైన వెయిట్‌ ను పట్టుకుని ఇసుకలో నడుస్తూ వెళ్తుంది. ఇంకా ఆమె పలు రకాల వర్కౌట్స్‌ చేయడంతో పాటు కుక్కతో కూడా సరదాగా కొంత సమయంను గడిపింది. రష్మిక ఆ వీడియోను ఇన్‌ స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వచ్చే నెల నుండి రష్మిక పుష్ప సినిమా షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంది. ఇటీవలే ఈమె నానికి జోడీగా శ్యామ్‌ సింగరాయ సినిమాలో నటించేందుకు కన్ఫర్మ్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.